ఈ పుట ఆమోదించబడ్డది

4

రసాభరణమునఁ బ్రథమాశ్వాసమున స్థాయిభావములకు లక్ష్యలక్షణములను, విభా వానుభావ సాత్త్విక భావలక్షణములను శృంగారాది నవరసములకు నుదాహరణముల నొసంగి కవి రసము సామాజికానుభావ్య మని నిర్ధారించెను.

రెండవ యాశ్వాసమున నాలంబనోద్దీపన విభావములకు లక్షణమును దెలిపి, భావహావాదులగు శృంగారచేష్ట లుద్దీపనాంతర్గతము లని లక్ష్య లక్షణములతో వాని నొడివి, యుద్దీపనాలంకృతులను నుద్దీపనస్థలంబులఁ బేర్కొని యనుభావమును దెలిపి, యష్టవిధసాత్త్వికభావములకు, ముప్పది మూఁడు సంచారిభావములకు సోదాహరణముగా లక్షణములను జెప్పెను. ఇందు సంచార్యాది భావలక్షణముల నొండురెండు చోటుల మతభేదము కన్పించును గాని యది పాటింపఁదగినది కాదు. ఈకరణమున నేర్చుకొనఁదగిన విషయ మొకటి కలదు. సంస్కృతమున నాలంకారికులు పలువురు తెలుపని శృంగార, భక్తి, వాత్సల్యములకు నైకకంఠ్య మును గవి సాధించినాఁడు.---

"రతి దా నాయకనాయికాదిపరతన్ రంజిల్లు శృంగారమై
క్షితిలో దేవగురుద్విజాదిపరతం జెన్నొందు సద్భక్తియై
సుతమిత్రాశ్రిత సోదరాది పరతన్ సాంపారు వాత్సల్యమై”

తృతీయాశ్వాసమున సంభోగ విప్రలంభ శృంగారములను జూపి యాలంకారికులు సంసృతమున సాధారణముగాఁ బేర్కొనని, నాట్యవేదమున మాత్రమే తెలుపఁబడిన, పంచవిధ మగు వాగ్విలసన, నైపధ్యాంగక్రియా, సంకీర్ణ, మిశ్ర, శృంగారమును గూడ విస్పష్టముగాఁ గవి దెలిపినాఁడు; పిదప భావోదయాదులను రససాంకర్యములను దెలిపెను. నాల్గవ యాశ్వాసమున నాయికానాయకులఁ గూర్చి దిఙ్మాత్రముగా వ్రాసినాఁడు.

5

స్థాలీపులాకన్యాయమునఁ బార భేదముల నొకింతఁ జూపుదును. రసాభరణము రెండవపుటలో నుత్సాహలక్షణముఁ దెలుపునపుడు “లోకోత్తరకృత్యంబులు గైకొని యవి యెడఁ కుండ”నను పాఠము నాదరించి "యవి యడఁపకుండ”ననుపాఠమును సూచించినారు ప్రకాశకులు. రెండుపాఠములకు సామాన్యతాత్పర్యమున భేద మంతగాఁ బొడకట్టకపోయినను సూక్ష్మముగ