ఈ పుట ఆమోదించబడ్డది


క్కెక్కిన వజ్రధారల నహీనమయూఖము లంతరిక్షమున్
దిక్కులు బిక్కటిల్లఁ నదితిప్రియపుత్రుఁ డుదగ్రలీలతోన్.

భయానకరసము

ఉ.

ఆలమునందు ఘోరదనుజావళిఁ గూల్చి నిజాస్యరేఖ నా
భీలత దోఁప వాలు జళిపించుచు హుంకృతు లుల్లసిల్లఁగా
శూలికిఁ దత్పరాక్రమముఁ జూపెడువేడుక నేగు నమ్మహా
కాళి విజృంభణంబుఁ గనఁ గాలునికైనను భీతివుట్టదే.

బీభత్సరసము

చ.

దురమున నందికేశ్వరుఁడు దుర్దముఁడై నుఱుపంగ రాక్షసో
త్కరవరగాత్రముల్ మెదిగి కాళ్ళును జేతులు నుత్తమాంగముల్
బరులును వీఁపులుం బిఱుఁదుఁ బ్రక్కలు రూపర స్రగ్గి రొంటె[1] మైఁ
బురపుర మ్రింగుచుం[2] గదురు భుగ్గున నామట నున్నవారికిన్.

అద్భుతరసము

చ.

చెలువుగఁ బచ్చిమంటఁ దగఁజేసి కుండను దేహ మందులో
జల మనలంబు నాయనలసంఘము మీఁదట నోలివాయు వి
[3]ట్టలముగ నొక్క బట్టబయలం బదిలంబుగ నిల్పి పెక్కురూ
పుల సృజియించె బ్రహ్మ తలపోయఁగఁ జిత్రచరిత్రుఁ డెయ్యెడన్.

శాంతరసము

ఉ.

మ్రొక్కిన వెక్కిరించినను మోదిన గందము దెచ్చి పూసినం
ద్రొక్కిన నెత్తుకొన్నఁ గృపలోఁ గుడిపించినఁ బస్తువెట్టిన
న్నిక్కును స్రుక్కులేక తరుణీజనులందును మ్రాఁకులందుఁ దా
నొక్కవిధంబ కా మెలఁగుచుండు మహాత్ములఁ జెప్ప నొప్పగున్.


క.

నవరసములయందును గా
రవమున శృంగారవీరరౌద్రాద్భుతముల్
భువి లోకోత్తరనాయకు,
నవిరళముగ నాశ్రయించు నది యె ట్లనినన్.


సీ.

రసము నాయకసమాశ్రయమునఁ బ్రావీణ్యుఁ డగునటు చేష్టలనైనఁ దత్క
థాకర్ణనంబున నైన సామాజికప్రకరానుభావ్యమై పరఁగుచుండుఁ
బరగతంబయ్యు సద్భావనచే రసోదయవిశేషము విరుద్ధంబు గాదు
మఱియుమాలత్యాదిమహిళాప్రసంగంబు వినుచు సభ్యులు[4] నిజవనితలందుఁ

  1. రొంటిమై
  2. బొంగుచున్
  3. ట్టలముగ నొక్క బయిటం బదిలంబు నిల్పియు వాని పెక్కురూ
  4. సభ్యుల