ఈ పుట ఆమోదించబడ్డది


వ.

మఱి విభావం బెట్టిదనిన.


క.

చను నాలంబన ముద్దీ
పన మనఁగా ద్వివిధమై విభావము మఱి యం
దున నాలంబన మన్నది
ననుపమసమవాయికారణము రసమునకున్.


వ.

మఱియు నిమిత్తకారణం బగు నుద్దీపనవిభావం బెట్టిదనిన.


క.

ఇల నుద్దీపన మొకటియు
నలి నాలంబనగుణం బనంగాఁ దచ్చే
ష్టలు నా దదలంకృతి యన
నలరుఁ దటస్థములునాఁగ నగు నలుదెఱఁగుల్.


క.

తొలఁగదు కార్యము మొదలం
గలసియుఁ జేయు సమవాయికారణ మది తాఁ
గలయక కార్య మొనర్చును
నలిఁ దొలఁగు నిమిత్తకారణం బనునది తాన్.


క.

అనుభావంబు కటాక్షం
బును భుజవిక్షేపణంబు మొదలయి కార్య
త్వనిరూఢి నుల్లసిల్లును
వినుతస్తంభాదు లష్టవిధసాత్త్వికముల్.


క.

తగు సంచారము లనఁగా
మొగి నిర్వేదాదిభావములు ముప్పదిమూఁ
డగు రసికులమతమున నవి
జగమున సహకారు లగుచు సన్నుతి కెక్కున్.


గీ.

కారణముఁ గార్యమును సహకారిచయము
నై విభావాదు లిబ్భంగి నతిశయిల్లు
నీసమూహంబు రసములం దెట్లయట్ల[1]
నడచుఁ దత్తద్రసానుగుణంబుగాఁగ.


ఉ.

ఆదట వర్ధమానవిభవాతిశయంబున వార్ధులట్లు ర
త్యాదులు వీచుల ట్లదయమౌ నడఁగుం బెరభావపంక్తి ని
ర్వేదముఖోపభోగరుచివృద్ధిరసం బది నాట్యసంగతిన్
మోదమెలర్ప సభ్యుల మనోగతులం[2] దగు కార్యమై చనున్.


క.

రసములవలన రసంబులు
పొసఁగఁగ నుదయించుననియుఁ బూర్వోక్తమగున్
వసుమతి నొకరసమున కొక
రసము విరస మనియుఁ జను పురాకృతకృతులన్.


సీ.

శృంగారమునఁ బుట్టెఁ జెచ్చెరహాస్యంబు గలుగు రౌద్రంబునఁ గరుణ మఱియు[3]
వీరంబువలన భావింప నద్భుతమగుఁ బటుభయానకము బీభత్సఁ బొడముఁ
బరఁగు శృంగారబీభత్స లొండొంటికి హాస్యంబుఁ గృపయు నన్యోన్యరిపులు
రౌద్రాద్భుతములు పరస్పరద్విషులు మిథ్యాహితు ల్వీరభయానకములు
త్రివిధలక్షణముల[4] దీపించు నన్నియు
రూపమునఁ దలిర్ప రూపరసము
వాక్ప్రవృత్తి దోఁప వాగ్రసంబగుఁ గ్రియ
లందుఁ గానఁబడుఁ గ్రియారసంబు.


సీ.

శృంగార ముత్పలాంచితము విష్ణుఁడు రాజు[5] తెలుపు హాస్యము గణాధిపుఁడు భర్త[6]
కరుణ కషాయంబు కాలుఁ డేలిక రౌద్ర మవ్యక్తరాగంబు హరుఁడు వరుఁడు

  1. కెల్లనిట్లు
  2. మనోగతులుం
  3. రౌద్రమునఁ బ్రఖ్యాతకరుణ
  4. లక్షణములు
  5. భర్త
  6. ఱేఁడు