పుట:రఘునాథ తొండమాన్ వంశప్రతాపమాలిక.pdf/9

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుండ్లకులోపల గుప్పుమంచని తూఱి తెగఁబనివాండ్రచేఁ దత్తరమున
నిసుకనించిన గూండ్ల విసువక ముందిడి యెదటిగుండులవల్ల నెత్తిపోక
బలముచేయుచు వేగబత్తెరిగావించి యందుఁ బిరంగులఁ బొందుపఱిచి
యెడతెగకయె గుండ్లు గడగడగడయనఁ జేసినచేఁతలు చెప్పనగునె
యొకప్రక్క నడుగంట నొకటిపై నొకటిగాఁ గోటవిడియగొట్ట గుండ్లరవలి
యొకప్రక్క లోపలియుప్పరిగెలు వ్రీలి ధరణిపైఁ బడునట్టి దడదడలును
నొకప్రక్కఁ గొత్తకా లొడ్డుగాఁ గొని నిల్చి తలలెత్తువారల తలలు చదియ
నింగియెల్లెడఁగన్న రింగనుమ్రోఁతలు నేకముగఁ జెలంగ నెదటిపౌఁజు
కలఁగి పాఱు టెఱింగి కార్యంబనుచు బొంగి యిడియఁగొట్టి యట్టి యిమ్మెఱంగి
యగడి తగఁబూడ్చి తగునట్టిసోజర్లఁ జేసి లగ్గలుపట్ట సెలవొసంగఁ
జేతితుపాకులు చెలఁగంగ సోజర్లు పెరపెరలాడుచుఁ బిఱుతివియక
కొందఱు కోటపైఁ గొత్తరాల్ మొదలుగఁ గలచోట్లను మొనసి కడుదుచూపఁ
గొందఱు వాకిండ్లయందుఁ గ్రమ్ముక నిల్వఁ గొండఱు వరుసగాఁ గోటలోన
వీథివెంబడి సాగ వెఱపున జనములు గుండ్లకు [1]వెఱగంది గుంపు విడక
సందులగొందుల నెందును గనుఁగొన్న నిలిచినతావున నిలిచియుండ
ఆరీపుసాహెబు అడ్డముగా వచ్చి తప్పుగుండులు తాఁకి ధరణిఁబడిన
[2]నామాటలను విని యప్పుడె సరదార్లు గుప్పనిలోఁ జొచ్చి కుతుకమునను
ఖామందులను బట్టి కావలి నిడఁజేసి పేదసాదల నెల్ల వెలికి విడిచి
గడులెల్ల మెల్లగాఁ గైవసం బొనరించి కర్తరుకును రాజ్యకార్య మిచ్చి
తొండమానుని వారిదండులోఁగలయట్టి సరదార్లకును వారిజనుల కెల్ల
నీనాము లిప్పించి యిఁకమీఁద సీమకుఁ బోయిరమ్మనిపంపఁ బురము సేరి
వెలయుచునుండిరి వింత నేనేమన నలన బాపును జేరి యణఁగినట్టి
రెడ్డియు నొడయారి రీతితప్పుచు వీఁగి యాజ్ఞనుమీఱినా రనెడిమాట
నాలించి తానును నాగ్రహవ్యగ్రుఁడై సామాజికులతో యోజనను జేసి
యుగ్రత నుందతుల్ ఉమ్రాబహద్దరు తనమనోభావంబు తగినరీతి
లలితుఁడైన విజయ రఘునాథనృపతికి వ్రాసిపంపిన వారిభావ మెఱిఁగి
తొరయూరిసీమపై సరదార్లఁ దగునట్టి సన్నాహములతోడ సాగుఁడనిన
ఆశూరవర్యులు నపుడె మోహరించి కోటలపురములు ఘోరవనుల

  1. దిగులంది
  2. ఆమాటలను విని యపుడె లోనికి వచ్చి నగరివాకిటనిల్చి తగినయట్టి