పుట:రఘునాథ తొండమాన్ వంశప్రతాపమాలిక.pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరిది మేదినిసాయిర్పకు మందానికి నరిదికొన వాఁడు బారుతీరి
చేవడిపిరవంగఁ జెడినజనములు వెలవెలయై గుండె కలఁగి పాఱ
మందుమియ్యాఖాను నెందును బోవక కైదువేలయు సీమ కరిగియుండ
మరియొక్కనాయల్ల మమదల్లిఖానుఁడు మధుకతెన్మల్వల్లి మహికిఁ దగఁగఁ
దనయాజ్ఞఁ జెల్లింపఁ దగును వీఁడంచును నిసుపుర్టాకుముదాని నెంచి పంప
వాఁడు నాఁ[1]దిక్కేలు పాళగాండ్కనునెల్లఁ గూర్చుక యెదురైనఁ గోపగించి
మమదల్లిఖానుఁడు మఱికఱకులైనట్టి శార్వేనుకేమలు పంపఁబిలిచి
యేకాంతమొనరించి యెట్లఫౌఁజును జేర్చి వహి మీఱఁ దిరిచినాపల్లె చేరి
సమరధూర్వహుఁడౌ విజయరఘునాథేంద్రు రప్పించి కలనికి రమ్మటన్న
రాణువల్ రౌతులు రాచఱికమ్మును గలిగినంత జనులు బలిసికొలువఁ
దోడుసూప నడిచి తోడనే మధురపైఁ దగినతావు లెఱింగి దండుదిగిన
నామాట విని వాఁడు నాత్మలోపలఁ గలఁగి ద్రోహిగావున వేరె తోఁపకున్న
జెంతటివారలె చేరుట్టుగాఁబట్టి యూరకయె నబాపు గొప్పగింప
వారిఁదూఁకుందీసిని తోనే యాసీమకుఁ దగినవాని నిలిపి తాను దిరిగి
తొండమానుని వారిదండును దోడ్కొని సీమకుఁ బోయిరా సెలవొసంగె
అటులుండ నొకనాఁడు హన్రెబిల్ కుంపినీకార్యములకు నెల్లఁగర్తయైన
సాహసియైనట్టి జన్నలుల్లాంగునురు శ్రీరంగసీమనుగల...................
గడుల నెల్ల జయించి కానుకలను గాంచి రావలెనంచని రవళిమీఱ
[2]రమ్యుఁడౌ శ్రీరాయరఘునాథతొండమాన్ ఘనుని తో డొనరింపఁ గడఁగివేడ
దండు పంపుమటంచుఁ దాను గాగిత మపంప నప్పుడె సుభటులనైదువేలు
మున్నూఱుగుఱ్ఱముల్ సన్నద్ధముగఁబంపఁ దత్క్షణంబే వాఁడు తరలిపోయి
కరువూరికోటను అరవకురిచ్చియు దిండుకల్ కోటను దీసియుండఁ
గర్నలై నపులటన్ ఘనుఁడల్లదండుకుఁ గార్యకాఁడైవచ్చి గడుసుగాను
బైసాగి బెంగుళూర్ వఱలోనఁగలయట్టి గడుల నెల్ల జయించి కడిమిమీఱ
బాలకాడిం జేరి పైసాగి యచ్చటి దుర్గముల జయించి దొరలవలనఁ
గానుకల్ గైకొని కడుసంభ్రమముతోడఁ దొండమానుని వారిదండులోని
వక్కీలు రప్పించి బాగుగా మీవారు బహుదినంబులుగాను బద్దుతోడఁ
గుంపినీవారికిఁ గుమకుచేసినవారుగాన మీ కిచ్చితి ఘనతమీఱ

  1. పక్కలి
  2. రమ్యగుణునికోటి