పుట:రఘునాథ తొండమాన్ వంశప్రతాపమాలిక.pdf/6

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుండులు గుండ్లంచుఁ గూఁతలు పెట్టిరె తురుపువారీ చేఁత తోఁపలేదొ
జీరాలు కేడెముల్ చిలుతాలుబొమిడికల్ దస్తాలటంచని తట్టువడక
వేసినతావున వ్రేటాఱుతున్కలు గాకరిత్తను [1]సోఁకగాన నెచట
నబ్బబ్బ [2]యెన్నైన నాలములోపల మంచిదెబ్బను దీసె నంచుఁ బలుక
దాఁగవచ్చినచోట దండుమాట లవేల యూరకుండుఁడటంచు నొకఁడు వలుక
నలసినగుఱ్ఱముల్ సొలసిన సోల్జర్లు బడలికఁ జెందినఁ బాఱువాండ్రు
రిత్తసీపాయిలు రుత్తదోస్తానాలు కడిపోయినట్టి చేకత్తు లలర
ఖడ్గకుంతాఘాతఘనతరక్షతిగళద్రక్తధారాతిదుర్దాంతు లగుచు
మోమున ఱొమ్మున ముందటిగాయముల్ నెత్తురెల్లెడఁగన నెరయుచుండ
శూరులు వెడలిరాఁ జూపరు [3]ల్కనుఁగొని యత్యద్భుతరసం బనుభవింప
విజయలక్ష్మి చెలంగ వెడలి పురముఁ జేరి తొండమానునివారిదండుఁ జూచి
మీరు కుంపణివారిమేలు కోరినవార లనుచు గౌనర్దొర హర్ష మొప్ప
మీదొర కెప్పుడు మేలుకలుగుచుండు నని జనులకు నినా మధిక మిచ్చి
సంతోషమునఁ బంపసాగి సీమకు వచ్చి తమతమయిచ్చలఁ దగిలియుండ
[4]గౌనరు మమదల్లిఖానుఁడు మొదలైనదొరలు కొల్వున నుండుతఱిని మనకుఁ
దొండమాన్ బహదరుదండు మిక్కిలికుమ్కు చేసి యించ్చుట ప్రశంసించి వారిఁ
దోడ్తోనె రప్పించి దొర లెల్లను నుతింప సమ్మాన మొనరించి సంతసించి
సీమకుఁ బొమ్మని సెలవిచ్చి పంపఁగా దనము వెల్వడి వచ్చి తనర విజయ
రఘునాథతొండమాన్ రాయహంవీరుని భేటియై ఖబురంత విన్నవించి
తమతమయిచ్చలఁ దగురీతిని జెలంగ నాతఁ డత్యంతసంప్రీతిఁ దనరె
నటులుండ........................దొరవారి కొప్పించి మెఱయుచుండ
నటులుండ నొక్కనాఁ డాలముఖానుని మేనల్లుఁడౌనట్టి మెందుమియ్య
యనుపేర వెలసిన మొనగాఁడు బలిమిచే మధుర తెన్నల్ వెల్లి మట్టుగాను
వ్యాపించియున్నట్టివార్త వినినవాపు గర్న లీరన్నను ఘనుని బిలువఁ
బంపి తెలియఁజేయ వల్లెయంచును వాఁడు తెన్నవల్లికిఁ బోవఁ దెంపుతోడ
నైదుపటాలాలు నాయితమై రాఁగఁ దొండమానునివారితోడుఁ గోర
ఆయన పంపిన యైదువేలజనంబు వెంటరా వానిపై విడిసె

  1. సోక
  2. యేమైన
  3. లెల్లను ముందఱకన్నను నందమనఁగ
  4. ఇక్కడఁ గ్రిందియేడుచరణము లుండవలయునని మొదటి పుస్తకములోని చిత్రికవలనఁ దెలియును.