పుట:రఘునాథ తొండమాన్ వంశప్రతాపమాలిక.pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినుముగాయకాండ్ర వితమేమి చెప్పుదు నెత్తురుజొత్తిల్లఁ దత్తరమున
లేచిపోవఁదలఁచి లేవరాకుండిన జరగువారును నట్టెయొరగువారుఁ
గొఱప్రాణములతోడ గుఱగుఱమనఁ జూచి నొప్పిఁ ద్రుళ్లిపడఁగ నులుకువారు
బరిగుఱా లడ్డంబుపాఱినఁ గనిపెట్టి పొల్లువారును నట్టె త్రుళ్లువారుఁ
జెంగటిచెట్లను జేరఁగా మదినెంచి పొల్లిగింతలు పెట్టి పోవువారు
మేదినిపైఁబడి "మేరెహాద్గయెఅరే అల్లా"యటంచని యడలువారు
“పాయిగేలేకి మీకాయికరూ ” యని చెంగటివారితోఁ జెప్పువారు
‘‘ఏను మాడలి నాను ఇల్లి నమ్మొవ్వరు యెల్లిహోదరొ" యని యేడ్చువారు
[1]"పుదుచేరి యారణ్ణపుణ్ణంగతయెనంచి అరమందపడిపొచ్చుగనెడివారు
ప్రాణము ల్పోలేక పదములఁదన్నెడు నరులఁ జేకత్తిచే నఱకువారుఁ
బాఱిపోవదలంచి పదములురాకున్న మొండెములై పై వైచుకుండువారుఁ
[2]దెగి వ్రేలుతలలూడ నొగులురౌతులతోడ గుప్పుగుప్పున దాఁటుఘోటకములు
ఒకప్రక్కఁ బ్రేగులు నొకప్రక్కఁ బుఱ్ఱెలు నొకప్రక్క నెమ్ములు నొకటసొమ్ము
లలరంగఁ గనఁగూడ కతిరౌద్రమైనట్టి కలనిపట్టులఁ దారు నిలువలేక
విఱిగిపాఱెడివారి వితములే[3]మందును గానలలోవారు కలసిమెలసి
పాఱుచో శిఖలంటి కోరిందముండ్లీడ్వ విడిచిపెట్టుమటంచు వేఁడువారు
నేగుచో మఱుఁగున నెదిరిన తమవారిఁ జూచి దిగ్గున నుల్కి సొలయువారు
బయలు కన్గొనుచోట వడిఁ బాఱి పాఱుచుఁ బొదలుకన్గొనుచోటఁ బొంచిపొంచి
వెనుక వచ్చెడివారి వేగఁ జేతులు చాఁచి గుంప్పు గూడకుమంచుఁ గూఁతలిడుచుఁ
గొండల గుహలందుఁ గోనలఁ గానలఁ గొందఱు పలికిరి కూడియుండి
ఇంగిలీజుదొరల దీఫౌఁ జనుచు విన్న మేము నీదండుకు రామటంచు
గడియదూరంబునఁ గననీకకొట్టిన మనచేఁత లేమిటి కనెడివారుఁ
జేతికత్తికిఁ గత్తి చివ్వకుఁ జివ్వయుఁగాక యీగుండ్లైనఁ దాఁకవశమె
చెండ్లాల గుండ్లను జేటలఁజల్లిన నెదిరిపోర జగతి నెవరితరము

  1. యును
  2. "పయినున్న తమరౌతు పడిన విచ్చలవిడి ఫైసరంబులు నాఱు వారువములు
    వేడెమునట్టుచోవేటు .. తెగనట్ల తిరిగెడి యశ్వములును
    గుండ్లు చుఱ్ఱని తాఁక గుప్పుమంచని తూలి ఫరదళంబులఁ చేరు వాజితతులు”
    అనునివియును రెండవప్రతిలోనున్నవి.
  3. మనిచెప్ప