పుట:రఘునాథ తొండమాన్ వంశప్రతాపమాలిక.pdf/4

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[1]పిడుగుచేవలపోల్కిఁ బడుదుచేఁ బొల్పారు పదిపటాళంబులబారువాండ్రు
వహి మీఱఁదగిన యేబైవేలగుఱ్ఱముల్ రాజిగానిడిన పిరంగులలర
ఫౌఁజునడపి చెన్నపట్నము గూడలూర్ దాఁక గ్రమ్ముకయున్నదాడి చూచి
మట్టెఱుంగక వీరు మాపైని విడిసినారంచని [2]మదిలోన నరసిచూచి
పదిపటాళంబులు పదిఋజుముట్లను నిరువదివేవురు నింగిలీజు
[3]తురుపువారు నవాపుతోడిజనంబులు కుమకుగారమ్మని కోటివిజయ
రఘునాధతొండమాన్ రాయహంవీరుని దండుఁ బంపుమటంచుఁ దాను వ్రాయ
నేనూఱుగుఱ్ఱము లేనూఱు చివ్వలు పదివేలసంఖ్యతుపాకివాండ్రఁ
బంపినపిక్కట్టు ఫౌఁజుతోఁ జేర్చుక మొగ్గరంబులువన్ని మొదటఁగొన్ని
పీరంగులనునుంచి పిక్కట్లుగాఁ బంచి దానికిఁజేరువఁదళతళయను
కత్తులు మెఱయంగఁ గక్కసగాండ్రైన తురుపుసవారులు తుదలనిల్చి
యీరువాగునేర్పడి యీసునఁ బోరంగ గొప్పపిరంగులగుండ్లచేత
[4]ఝంఝాప్రభంజనజర్జరీకృతతూలజాలోపమానమై వ్రీలదళము
జడివానకాలానఁ దడిగోడలవితాన గడుసువెల్లువవేళ గట్టులట్ల
వరుసవరుసగాను బడుచుండె వేగమె తెఱపికానఁగనీక నెఱయసాగి
[5]కర తెగినంతలోఁ గ్రమ్ము వెల్లువపోల్కి నొక్కుమ్మడిగఁ బయిఁద్రొక్కసాగి
యిదె మీఱె నదె తూఱె నది పాఱె ననువేళ ఫౌఁజుకు మొనకల్గఁ బలికి పొగడి
[6]ఇది సమయ మనంగ నేకముగా రేగి పైనిఁ ద్రొక్కి నడచి బలము మెఱయ
[7]యెడతెగనీయక గెడగెడవాడిన నెదుటిఫౌఁజుకలఁగు టెఱిఁగి వేగ
తురుపునఁ జెయినూపఁ దూఱి యాశూరులు బ్రద్దలు తుంటలు పాళ్లుగాను
జేకొద్ది నఱకినఁ జెయ్వులన్నియు మాని పడియున్న యాఫౌఁజుపాటు వినుము
కాళ్లును వ్రేళ్లును గన్నులుఁ జన్నులుఁ దొడలును మెడలును నడుముఁ గీళ్లుఁ
జెక్కులుఁ బెక్కులు చేతులు మూతులు విఱిచిపఱచినట్టు వెలయుచుండ
[8]గాయము ల్గన్గొని కళమఁజెందుచుఁజని మొండెముల్ పైఁబడ మొగియువారు

  1. గుత్తిజనంబులగుంపు యేబైవేలు
  2. నవ్వుచు హానరెబిలు
    కుంపిణివారుగాఁబంపిన లాట్టు పిక్కట్టుబహద్దరు హాట్టు గారు
  3. తురుపులఁ గైసేసి తోడ్తో నవాపు సాహేబుకు కుమ్మకుజాబువ్రాయ
    నతఁడు విజయరఘునాధహం వీరున కాలాగె
  4. ఈచరణము లొకదానిలోనే కలవు
  5. ఈచరణము లొకదానిలోనే కలవు
  6. ఇది రెండవప్రతిలోఁ గలదు.
  7. యెడతెగనీయక బడుదుచేదాఁకుచో
  8. రెండపప్రతిలోనె కలదు.