పుట:రఘునాథ తొండమాన్ వంశప్రతాపమాలిక.pdf/3

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గడుసుగా నలువంకఁ గమ్మకయుండిన కోటకు వస్తువుల్ గూర్చుకొఱకు
శిస్తుగావలసిన వస్తువుల్ చేకొని తొండమానునివారు తోడుగాను
వచ్చి కీరణ్ణూరిబైటను విడిసిన నందఱు యోజించి యద్భుతముగ
దండుసాగఁగనిచ్చి తమకుబయలుదేర వాఖబురాలించి యలుక పూని
యాలముఖానుఁడు నాలముగావింపఁ బడమటిదిక్కున బారుతీరి
గగనమధ్యగతార్కకర్కశాంశుప్రతిఫలనదుర్నిరీక్ష్యపటుకృపాణ
పాణితౌరంగికపాదాతఖురపదసంచలద్ధూళి[1]ప్రచ్చాదితాభ్ర
మండలుఁడై రాఁగ మఱికోపుసాహెబు దండురెట్టమలను దాపుచేసి
రే[2]కవాలెగ నెత్తి రేఁగిన శూరులఁ [3]బఱవవద్దటనుచుఁ బట్టుపఱిచి
హౌదావులోనుండు నాలముఖానుని జాగుగాగుఱిసేసి ఫయరటన్న
హౌదావులోనున్న యాలముఖానుని మేనుచెదరి జనులఁమీఁదఁ బడిన
దళము దాని నెఱిఁగి తగినరీతి విఱిగి దాఁగఁదావు లెఱిఁగి తగరు మఱిగి
నానాగతులఁ జెందునట్టి ఫౌఁజులు చూచి చేయునదియులేక చింతనొంది
నిలిచినతావున నిలిచి కలఁక చెందు ఛందసాహెబు దూకు నొందఁజేసి
హితుఁడై నవాపుసాహెబునకు సీమతో ద్రిశిరఃపురంబు గైవశము చేసి
విజయాంకుఁడై తాను వెలయుచునుండఁగ నటుకొన్నినాళ్లపై నబ్బురముగ
గూడలూ[4]రునయందుఁ గుంపిణీవారికిఁ బ్రాంచువారలతోడ బవరమంట
[5]బలముచాలక యున్న బాగుగా యోజించి గౌనర్ బళాయరన్ కారుచిచ్చు
మమదల్లిఖానుని మద్దత్తుగాఁ గోర నతఁడు విజయరఘునాథనృపతి
[6]సాహాయ్యకము సేయ సమయమంచనికోర నప్పుడ యాఘనుం డైదువేల
దండుఁ బంపుమటంచుఁ దాను వ్రాసి పనుప నప్పుడె యాతఁడు నైదువేల
జనముల మున్నూఱు జవనాశ్వములఁ బంప బలయుతుఁడై సాగి ప్రాంచువారి
గెలిచి మోదమున వక్కీలును బిలిపించి సీమకుఁ బొమ్మని సెలవొసంగె
నటులుండ నొకనాఁడు హైదరుసాహేపు ముసలల్లి[7] రప్పించి మోదమునను
మంతనం బొనరించి మమదల్లిఖానుఁడు కుంపిణివారలకుమకువల్ల
నెవ్వ రీడనుచును హెచ్చియున్నాఁడని యేర్పడి కయ్య మొనర్పవలయు
ననుచు దండునుగూర్ప [8]నత్యుగ్రులౌనట్టి పదివేలజనములు ప్రాంచువాండ్రు

  1. సంఛాది
  2. కలాలెగ
  3. బదర
  4. ర్బయలున
  5. బలము చాలకనె మిక్కిలికక్కసంబైన
  6. ఈచరణము 2వ ప్రతిలోలేదు.
  7. తోడమోమోటుకొంత
  8. నఱువదివేల్గుత్తిజనములు