పుట:రఘునాథ తొండమాన్ వంశప్రతాపమాలిక.pdf/2

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గర్భసంభవుఁడు వెంకనసుధీవర్యుండు తత్పుత్రుఁడౌ నేను దగినరీతి
నావలివారల యద్భుతచరితముల్ [1]విశ్రుతం బై రహి వెలయుచుండ
[2]మందమారుతలోలకుందబృందాంతరస్యందదమందమరందబిందు
తుందిలసారస్యధూర్వహఫణితిచే వినిపించెద నొకింత వినుము దయను
దక్షిణసీమకుఁ దగినవా పైనట్టి మమదల్లిఖానుఁడు మహితబలుఁడు
కుంపుణీవారలఁ గూడి నడిచినట్టి [3]యది మొదలు జగడ మవధరింపు
చలమున నలచందసాహేబు చెలిమికై యలవిజయరఘునాథావనీంద్రు
కడకేగ నాలమఖానుని బంపిన వెస నతఁ డాతని బేటిసేసి
యప్పుడె యలవాఁడు నతిరయమున
సాగి బేటియైనఁ జతురత మెఱయఁగఁ బలుకఁదొడఁగె వాఁడు వయనముగను
యట్టియాపురమాదియైన భూపాలురు మనపారిపాల్యాల మహిపతులును
దనరనవాపుపై దండెత్తి తిరిచినాపలికోటను జయింపవలసి మేము
పనిఁబూని వ్రాసిన వారలు బలముతో వచ్చి చే[4]రెదమని వ్రాసినారు
తామును నీరీతి దయచేసినట్లైన సగము రాజ్యము మీకొసఁగెద మనుచుఁ
బలుకుమనిన [5]రీతిఁ బలికితి నన విని కూడిరానిపనిని గోరినారు
చెనఁటియయినవాఁడు చెట్లపై పండ్లను గోరినట్టులు మీరు కోరినారు
మేము నవాపుకై మీమీఁద దండెత్తనేర్పడియుండ నిదేటిపలుకు
పలికెదరనుచును బకపక యనినవ్వి వినునవాపుతోడి వింతలనుచు
మమదల్లిఖానుఁడు మహితబలాఢ్యుఁడు మహిఁ బేరుకన్నట్టి మంత్రివరుఁడు
పరవాహినీపతిబడబానలంబును సామదానభేదచతురమతియుఁ
గాన నీబుద్ధిని గడకేగునటు ద్రోసి బ్రదుకుత్రోవను జూడవచ్చు ననుచుఁ
బలికిన[6]యామాట ములుకులవలె నాటఁ గనలుచు నలవాఁడు కడకుఁ దొలఁగి
చేరిన [7]దొరలను జేర్చుక యలప్రాంచు ముసలల్లియనువాని ముందు చేసి
తిరిచినాపలిచుట్టు దిగి రస్తురానీక త్రోవకట్టినమాట తోడనె విని
మంత్రివర్యుండైన మమదల్లిఖానుఁడు తిరిచినాపలికోట చేరనడిచె
బలముతోడుతను కేపన్ కోపుసాహేపు జన్నలారన్ దొర సాగిరాఁగ

  1. ధరణిలోన వెలయఁదగఁదెలిపెద
  2. ఇదియు దీనితరువాత చరణమును 1వ ప్రతిలో
    మాత్రమేయున్నవి.
  3. జగడంబులన్నియు సరవిగాను
  4. రునటుల
  5. మాట
  6. మాటలు
  7. జనముల