పుట:రఘునాథ తొండమాన్ వంశప్రతాపమాలిక.pdf/14

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొండమాన్ వంశప్రతాపమాలికకుఁ బరిషత్పుస్తకభాండాగారమున మూఁ డసంపూర్ణ ప్రతులున్నవి. మూఁడింటినుండి యింతవట్టు ప్రతి వ్రాసి ప్రకటించితిమి. ఇది పరిషత్పత్రిక తృతీయసంపుటము పుట 304లోఁ బ్రకటింపఁబడిన నుదురుపాటి వేంకనార్యుని తొండమాన్ వంశావళి తరువాయి. ఈగ్రంథములోఁ గవి తనపేరును దెల్పక పైవేంకనార్యుని పుత్రుఁడైనట్లుమాత్రము "నుదురుపాటి సీతారామవరకవీంద్ర | గర్భసంభవుఁడు వెంకనసుధీవర్యుండు తత్పుత్రుఁడౌనేను దగినరీతి॥" నని చెప్పుకొనియెను. ఇక్కవి బిల్హణీయమును రచించెను. చూ పరిషత్పత్త్రిక 3వ సంపుటము 312 పుట మొదలు. ఇందుఁదప్పులు విశేషముగానున్నవి, దిద్దుట కనువుపడని తప్పులు విడువఁబడినవి. ప. అ.