రఘునాథతొండమాన్ వంశప్రతాపమాలిక
సీసమాలిక
[1]శ్రీబృహన్నాయికాసేవాత్తసంపద పదవినతారిభూపతినికాయ
కాయజనళబాహులేయాతిసుందరదరదరాతినిలయదచలకుంజ
కుంజరారిసమాన ఘోరపరాక్రమ [2]క్రమలసత్ప్రాజ్యసామ్రాజ్యవిభవ
భవసుఖవిభవానుభవ సౌభరిసమాన మానవవరనీతిమహితమహిమ
హిమకరసమకీర్తివిమలదిగంతరతరవారిధారాహతారివిసర
సరళనిస్తులతరసద్గుణసంపన్న [3]పన్నగేంద్రసమానవచనచతుర
తురగాధిరోహణతోషితరేవంత [4]విశదయశఃపూరవృతదిగంత
శీతాంశురవికలశీకృతాత్మనిశాంత గర్వితోక్వివరగణకృతాంత
శరణాగతత్రాణకరుణాయుతస్వాంత ఘనతరకవిజనవనవసంత
కోటీకులాంభోధికువలయినీకాంత [5]విబుధాళీకాంక్షితవితరణచణ
దినదిన సంప్రవర్థిత [6]కటాక్షాపూర్ణ లలితాశ్రితద్విజరక్షణకర
[7]భాస్వత్ప్రతాపబిభ్యదమిత్రభూధవ రాజరాజతులితరమ్యవిభవ
లలితయక్ సీలింసి రఘునాథతొండమాన్ బహదరు పుడమిపైఁ బ్రబలఁదగిన
యట్టినీసంతతి యాఖండలుని బట్టి తామరతంపరై తనరుచుండు
ధీరుఁడౌ [8]నలకోటి తిరుమభూపుని బట్టి వరరాయరఘునాథ వసుమతీంద్రు
వఱకు ధరణిలోన మెఱసినయిరువది తరములవారల ధైర్యశౌర్య
విభవప్రతా[9]పాది విశ్రుతగుణముల మాలికగాఁజేసె మహిని వెలయ
ధరణిమహెూద్దండ బిరుదనుదురుపాటివంశ సీతారామవరకవీంద్ర
- ↑ శ్రీబృహన్నాయికా సేవాత్తవైభవ భనసుఖవిభవ సౌభరిసమాన
శ్రీబృహన్నాయికా సేవాధురంధర ధరణీతలఖ్యాతబిరుదవార
వారధిపాత్మజవాసదాలయపదపదవినతారిభూపతినికాయ. - ↑ గతలసత్ప్రా
- ↑ పన్నగేంద్రకణాదఫణితిచతుర (వేఱొకప్రతిలో) పన్నగభాషితభాష్యచతుర
- ↑ మార్గణమధుకరావళిలతాంత
- ↑ విబుధకాంక్షితార్థ
- ↑ కళాసం
- ↑ భాస్వత్ప్రతాపాత్తపరమావిరాజిత రాజితవిఖ్యాతరమ్యమూర్తి
- ↑ వరకోటి
- ↑ సముల్విస్తార