పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/34

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[గౌరి ప్రవేశించుచున్నది]

గౌరి - (మతిమంతునితో) అయ్యా! తమకోసం యెవరో తమా షావేషం వేసుకుని వకమనిషివచ్చినాడు. (అని తనలో నవ్వుకొనుచు సుబలునికి చేసైగచేయుచున్నది.) అతను ఠాణానుంచి వచ్చినానని చెప్పినాడు.

మతి - అతణ్ని లోపలికి తీసుకునిరా. తక్షణం తీసుకునిరా. (తనలో) సందేహంలేదు. అతనుపోలీసు బంట్రోతు. అతను మంచి సమ యంలో వచ్చినాడు. అతను యితనితల గట్టిగాపట్టుకుంటే యీకత్తీతో నేను క్షవరంచేస్తాను. (అని కత్తిపయికి తీయుచున్నాఁడు.)

గౌరి - యిప్పుడే తీసుకునివస్తాను. (అని వెళ్ళుచున్నది.)

సుబ - (మతిమంతుని మొగమువంక చూచుచు) ఈముసలాయ నకు నిజంగానే పిచ్చఅనుకుంటాను.

[మొగము కనఁబడకుండ ఎఱ్ఱతలగుడ్డ వికారముగా చుట్టుకొని రాముఁడు ప్రవేశించుచున్నాఁడు.]

మతి - ఇఖ నేను సిద్ధంగావుండవలెను. (అని కత్తి క్రిందపెట్టి బట్ట సవరించుకొనుచున్నాఁడు.)

సుబ — ఇడుగో రాముడు వచ్చినాడు. నాఅదృష్టం బాగా వున్నది. (అని రామునకు చేసైగచేయఁగా రాముఁడు మరల సైగ చేయుచున్నాఁడు.) మామా! ఈమనిషివేషం బహువిచిత్రంగా వున్నది. యితడు యిక్కడికి యెందుకువచ్చినాడు?

మతి — యెందుకూలేదు. వూరికేవచ్చినాడు. యితడుగారిడీ చేస్తాడు. (అని రామునిదగ్గరకుపోయి సుబలునిచూపి సైగచేసి మెల్లగా)