పుట:మ ధు క ల శ మ్.pdf/64

ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్

                          70
సకియా ! పల్మరు బాసతింటి మును పశ్చాత్తాపతప్తుండనై
యకటా! మేల్కొనియుంటినో యపుడు? సత్యంబింతె;తోడ్తో మధూ
త్సుకు డేతెంచెగులాబి చేతగొని, నాసూత్రానుతాపాశయ
ప్రకరంబుల్ తునిగెన్ సతంబయి సహస్రంబై సమూలమ్ముగన్ .
                          71
బహుమతియైన నాబిరుదువచ్చడ మాఱడివోవుగాక, ప్ర
త్యహము లభించెగా కభినయంబున పాపపుపాత్ర యీమధు
ప్రహసనమందు నాకు వరవర్ణి ని! అమ్మెడుదానికంటె నే
మహితపదార్థ మీ క్రయికమండలి విల్చెదరో వచించెదే.
                           72
కటకట ! ఈ గులాబికళికల్ వసివాడ వసంతమేగు; ము
చ్చటయగు నీవయఃసురభిసంహితయున్ ముగియున్ శుభాంగి ! పి
మ్మట నెపు : డెచ్చటెచ్చటికి ? మళ్ళునొ చెప్పెదవే రసాలని
ష్కుటముల బాడు నీకలికికోకిల, దాని నెవం డెఱుంగునో ?

61