పుట:మ ధు క ల శ మ్.pdf/56

ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్



                  58

చేసితి వల్పమృత్పటలిచే మెఱుగారు మనుష్యకాయ, మా
పై సృజియించి తీ ప్రమదవాటికలో పెనుబాము నీవహో!
ఈసుమనుష్యపుణ్యముఖ మే బహుపాపభరమ్మునన్ కళల్
మాసెనొ దానికెల్లసు క్షమార్పణమే పరిహార మయ్యెడున్.


                   59

ఒక రమజాను తుట్టతుది నొత్తగుసందెల చందమామ లే
వకమునుమున్ను నేను నిలువంబడియుంటిని కుంభకారవా
టికకడ నేకతంబున; ఘటీఘటకష్టకుటుంబముల్ నియా
మకమయినట్టులుండె నెడమన్ కుడి పంక్తులుదీర్చి వింటివే.


                    60

చెలియరొ ! చెప్పగా మిగులచిత్రము, ఆఘటసంఘమందు మూ
గలు పలుమాటకారులును కానగవచ్చిరి నాకు; నంత తొ
ట్రిలి పెనుతత్తరంబున ఘటీమణియోర్తుక కేక పెట్టె 'నీ
యిల ఘటకుం డెవండొ ? ఘట మెద్దియొ  ? తెల్పెదె'యంచు నర్థిమై.

53