పుట:మ ధు క ల శ మ్.pdf/52

ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్



                        52

ఆకసమంచు పేర్వడినయట్టి వితానము క్రింద. కొన్ని నా
ళ్ళేకముగా సుఖించి శమియించెద మింతిరొ  : చేతు లెత్తి య
ఱ్ఱాకట దానిసాయమునకై విలపింపకు, మస్వతంత్రమై
ప్రాకెడు నద్దియున్ నియతవర్తన నీవును నేనునుంబలెన్.


                          53

ఆది మృదండమున్ మెదిపి యంత్యమనుష్యశరీరపిండ ము
త్పాదనజేసి; రావల వెదల్ పడెబో కడసారిపంటకున్;
పైదలి : సృష్టిలో తొలిప్రభాతమె తద్గణితావసానకా
లోదయలబ్ధశేషముల నూది లిఖించె యథాక్రమంబుగన్,


                         54

వినుము ప్రియంకరీ! మొదల బిందునిపాతముహూర్తమందె, ఈ
తనుతరదేహిదేహసహితమ్మగు మామక భాగ్యచక్రక
ల్పనమున సంఘటించి, రల ‘పచ్చగుఱాలదొరన్' ఛదించి పై
కొనెడు గురుగ్రహస్తబకకూటము, నేమిటి కీవివాదముల్.

49