పుట:మ ధు క ల శ మ్.pdf/32

ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్


                        22

కులికెడు క్రొత్త శోభనపుకోకలు తాలిచి గ్రీష్మదూతి; న
వ్వులతిరునాళ్ళలోన తనివోముగదే మన మిందు, ముందు రా
గిలిన ప్రియుల్ గతించిరి సఖీ! మన మేగమె యింక భూమిక్రిం
దల బవళింప! నెవ్వరికొ తల్పములౌదుముగామె యావలన్,


                         23

మనమును మంటిక్రిందపడి మాయకపూర్వమె లబ్ధమైనదా
ని ననుభవింపజెల్లు తరుణీ! అటుపిమ్మట ధూళి ధూళితో
నెనసి యణంగిపోవు, మధు వెండును, పిమ్మట గానమాగు, గా
యనులును నిద్రవోదురు, లయశ్రుతులున్ చెవి కంద వాపయిన్.


                         24

వేడుక నేటిభుక్తికి లభించినదెల్ల వ్రయించు పుణ్యులున్
పీడితు లయ్యు రే పనుభవింపగ దాచు నికృష్టులున్ వినన్
పాడెడు చిత్రగుప్తుడు తమాలనికుంజమునుండి, 'ఏల యీ
యేడుపు మూర్ఖులార! ఫలియింపదు మీకృషి యిందునందునన్'.

29