పుట:మ ధు క ల శ మ్.pdf/24

ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్


                         10

అడవికి తోటకున్ నడుమ హద్దగు నీపొదరింటిపొంత నె
న్నడును నృపుండు సేవకు డనంజను భేదము సుంతయేని యే
ర్పడ, దపరంజిగద్దెపయి రాచరికంబులు సల్పుచున్ సుడిం
బడు సులతానుపట్ల అతివా ! అనుకంప వెలార్త మర్ధిమై.


                        11

ఈసుమశాఖచెంగట సఖీ ! రుచు లూరెడు వెన్న రొట్టెయున్,
ఆసవపూర్ణపాత్రికయు నందపుపాటలపుస్తకమ్ము సా
వాసముజేయ, నీ వడవివాడల నాడుచు పాడుకొంచు నా
తో సుఖముండ, నింక కలదో యిది స్వర్గముగాక యెక్కడో.


                       12

మరగిన యైహికేచ్ఛలభ్రమన్ పెనగొందుఱు కొంద, ఱెన్నడో
యొరగెడి స్వర్గభోగముల కోపిక నీడ్చెద రింక గొంద, ఱీ
తిరుగుడు లేటికో ? అసలు తీసుక శేషము నంటబోకు, మా
తురపడి పర్వులె త్తెదవు దూరపుపాటల కెంతచిత్రమో !

21