పుట:మ ధు క ల శ మ్.pdf/18

ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్


                       1

లెమ్ము: నిశాకమండలుతలిన్ పడగా విసరెన్ ప్రభాత మం
దమ్ముల దిఙ్మణిన్ చకితతారక లావల బాఱ, కాంతిసూ
త్రమ్ములయుచ్చు లొడ్డెను సుతారపు తూరుపువేటకాడు ర
మ్యమ్మగు పాదుషాకనకహర్మ్య శిఖాకలశాలిచుట్టునన్ .


                        2
చదల నుషఃకుమారి చెయిచాయలు లోపగ, కల్వరించుచున్
మెదలక యాలకించితి సమీపసురాభవనమ్మునం దిటుల్,
నిదురలు మాని మేలుకొని నింపుడు పాత్రను చిన్నలార ! త
త్సదమలజీపనార్ద్రమధుధారలు ఎండకమున్నె బుంగలన్.

                         3
ఆమధుశాలముందట ప్రియాన నిలంబడి కోడి కూయగా
నీమెయి చప్పటుల్ చఱచి 'రెందుల కూరక యాలసింత్రు రా
రేమి కవాటముల్ తెఱవ రేమి ? ముహూర్తము మించిపోయినన్
రా మిక నెన్ని యేండ్లకును, ప్రజ్వలితాసవ మెండు నింతలోన్.'

15