పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/64

ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

యుద్దాభూమిలో అమరుడైన ప్రప్రథమ స్వదేశీ పాలకుడు

ఈ విధంగా బ్రిీటిషర్లతో కదన రంగాన ధైర్యసాహసాలతో పోరాడుతూ చివరి శ్వాస వదలినస్వదేశీ పాలకులలో టిపూ ప్రథముడని చరిత్ర ఆయనను కీర్తిచింది. (..."Tipu Sultan was the single brave hero of Indian Histroy who fighting the Britishers met his martydom in the battle field.." - Prof.Jaya Prakash) ఈ విషయాన్నిThe sword of Tipu రచయిత Bhagavan S. Gidwani వ్యక్తం చేస్తూ, ఈ విషయాన్నిఓ విదేశీ చరిత్ర పరిశోధక విద్యార్థి ద్వారా తెలుసుకుని తాను ఆశ్చర్యపోయానని, ఈ విషయం విన్న తరువాత టిపూ మీద తనకు ప్రత్యేక శ్రద్ధ ఏర్పడిందని, దాని ప్రతిఫలమే ప్రఖ్యాత చారిత్రక నవల The Sword of Tipu ఉనికిలోకి వచ్చిందని పేర్కొన్నారు.

టిిపూ సుల్తాన్‌ ప్రాణాలు వదలిన ఆరు గంటల వరకు ఆయన మరణించిన వార్త ఎవ్వరికీ తెలియరాలేదు. యుద్ధ రంగంలో ఆయన కన్పించకుండ పోవటంతో పలు ఊహాగానాలు సాగాయి. ఆయన అమరుడైన విషయంస్వజనులకు కూడ తెలియదు. శతృవు చక్రబంధం నుండి సుల్తాన్‌ చాకచక్యంగా తప్పించుకున్నారని

శ్రీరంగపట్నలోని టిపూ అంతóపురం శిథిలాలు

                                            61