పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/57

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

మృత్యుంజయుడు టిపూ

టిపూ సుల్తాన్‌ గత్యతరం లేని పరిసితు లలో శ్రీరంగపట్నంకోటలోకి వెశ్ళారు. ఆ కోటను అన్ని వైపు ల నుండి ఆంగ్లేయాధికారుల బలగాలు,స్వదేశీ పాలకుల సెన్యాలు,పాలెగాళ్ళ బృందాలు చుట్టుముట్టాయి. ఈసారి శ్రీరంగపట్నంముట్టడి భారీ స్థాయిలో ప్రారంభమైంది. కర్నాటక వైపు నుండి జనరల్‌ హరిస్‌, కూర్గ్‌ నుండి జనరల్‌ స్టూవర్ట్‌,హైదారాబాదు నుండి లార్డ్‌ వెల్లస్లీ, దాక్షిణం వైపునుండి కల్నల్‌ రోడ్‌, కల్నల్ల్‌ బ్రౌన్‌ శ్రీరంగపట్నంలోని టిపూను చుట్టు ముట్టారు. నిజాం, మరాఠా పాలకులు, పాలెగాళ్ళు,వెల్లస్లీ కలలను నిజం చేయడానికి కంపెనీ సైన్యాలకు తోడుగా నిలిచారు. నిజాం సైన్యాలకు అర్థర్‌ వెల్లస్లీ స్యయంగా నాయకత్వం వహించాడు. చివరకు 1799 మే మాసం 4వ తేదిన, ఆంగ్లేయ కూటమికి టిపూకు మధ్యన భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆంగ్లేయ కూటమి అపార బలగాలు చీమల డండులా శ్రీరంగపట్నం మీద విరుచుకు పడు తున్నాయి. టిపూ బలగాలు శతృ సెనికులను కోట బురుజుల నుండి ఎదుర్కొంటున్నారు. టిపూ స్యయంగా పోరాటాన్ని పర్య వేక్షిస్తు న్నారు. సుల్తాన్‌ పట్ల విధేయులైన సైనిక యోధులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఈ యోధు ధాటికి శ్రీరంగపట్నమ్ కోట సమీపానికి శతృవు చేరుకున్నాకోట లోనికి ప్రవేశించలేకున్నాడు.

టిపూ కోటలోకి శత్రు సైన్యం ప్రవేశించిన వాటర్‌ గేట్ 54