పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/53

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

యుద్ధ నష్టపరిహారంగా టిపూ తనయుల పూచీకత్తు

పాలకులు మెసూరు రాజ్యం మీద విరుచుకపడ్డారు. భారీగా బలగాలను సమకూర్చుకుని మే మాసం నాికి శ్రీరంగట్నానికి తొమ్మిది మైళ్ళ సమీపానికి చేరుకున్నారు. ఆ సమయంలో టిపూ పాండిచ్చేరిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఆఘమేఘాల మీద శ్రీరంగపట్నం కదిలారు. ఆ సమయంలో వర్షాలు ఆరంభంకావటంతో కారన్‌వాలిస్‌ తాత్కాలికంగా యుద్ధ రంగం నుండి తప్పుకున్నాడు. 1792 జనవరి నాటికి లార్డ్‌ కారన్‌వాలిస్‌ శ్రీరంగపట్నానికి తిరిగి చేరుకుని అన్ని వైపుల నుండి మైసూరు రాజ్య రాజధానిని చుట్టుముట్టాడు. కంపెనీ సేనలు రాత్రిపూట టిపూ బలగాల మీద విరుచుకుపడ్డాయి. మరోవైపున స్వదేశీ పాలకులు, పాలెగాళ్ళు ఏకమై టిపూను చుట్టుముట్టారు . భయానక యుద్ధం జరిగింది. ఈ ప్రతికూల పరిసితు లలో శ్రీరంగపట్నం కోటలోకి టిపూ నిష్క్రమించారు. శతృసైన్యాల కూటమితో కారన్‌వాలిస్‌ కావేరి నదిని దాిటి కోట సమీపానికి చేరుకున్నాడు. శ్రీరంగం కోటను పూర్తిగా దిగ్బంధనం చేశాడు.ఆపరిస్థితులు టిపూకు ప్రమాదకరంగా పరిణమించాయి. గత్యంతరం లేని యుద్ధ వాతావరణంలో శతృవు బలగాలు, శతృవుకు తోడుగా నిలచిన స్వదేశీపాలకుల అపార సైనిక బృందాలను గమనించిన టిపూ యుద్ధ పర్యవసానాన్ని ఊహించారు. అన్ని విధాలుగా పై చేయిలో ఉన్న శత్రుపక్షం పెచ్చరిల్లితే మెసూరు రాజ్యలక్ష్మి పరాయిపాలు కాగలదని ఆయన అంచనా వేశారు. ఈ సందర్బంగా ప్రజల సంక్షేమం నిమిత్తం ఆయన సంధికి సిద్ధపడ్డారు. ఆంగ్లేయాధికారులు, 50 27