పుట:ముకుందవిలాసము.pdf/47

ఈ పుట ఆమోదించబడ్డది

40


మళ్ళీ ఈ ప్రబంధం ముద్రణకు నోచుకోలేదు. పూర్వ ముద్రిత ప్రతులుకూడా ప్రస్తుతం ఎంతో గాలిస్తే కాని దొరకవు. ఎక్కడో ఒక ప్రతి దొరికినా “సంవృత ఏవ శోభతే” అన్నట్లుగా దాన్ని భద్రంగా రక్షించుకోవాలన్న అభిప్రాయమే కలుగుతుంది కాని చదువుకోవాలన్న కుతూహలం కలుగదు. అంతేకాక ముద్రణ దోషాలు వగైరా. ప్రస్తుత ముద్రణంలో ఈ దోషాలన్నీ సవరించబడినవి.

ఒక శతాబ్ది క్రితం ముద్రింపబడి ప్రస్తుతం అందుబాటులో లేని ఈ ప్రబంధాన్ని ముద్రించటానికి తల పెట్టిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీని సాహితీప్రియులు అభినందించాలి.

గ్రంథ సంపాదన సందర్భంలో నాకు సహకరించిన ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు, డా॥ జి. ధర్మారావు, శ్రీ విఠల్ రెడ్డి, శ్రీ సత్యనారాయణ గారులకు నాకృతజ్ఞతలు

ముకుందవిలాస గ్రంథ పరిష్కరణకు, పీఠికా రచనకు అవకాశం కల్పించిన ఆంధ్ర సాహిత్య అకాడెమీ కార్యకర్తృ వర్గానికి ముఖ్యంగా తదధ్యక్షులైన శ్రీ దేవులపల్లి రామానుజరావుగారికి, కార్యదర్శులైన డా॥ ఇరివెంటి కృష్ణమూర్తిగారికి నా హార్దిక కృతజ్ఞతాభివందనాలు.

      "ఇద్దఱు జోడు నన్నకవి యెఱ్ఱన, తిక్కన సోమయాజి దా
       నుద్దగు వారికిన్ ముగురి కొక్క డె దీటగు నల్లసాని మా
       పెద్దన వారి తోడుతను బేరు వహించిన శ్రీ కణాదముం
       బెద్దన సోమయాజి విను పెద్దనఁ బొల్చు కవిత్వసంపదన్"

హైదరాబాదుఆర్. శ్రీహరి
26-5-1985