పుట:ముకుందవిలాసము.pdf/4

ఈ పుట ఆమోదించబడ్డది

మహిషులలో ఒకరైన భద్రాదేవితో శ్రీకృష్ణునికి వివాహం జరగడం దీనిలోని ప్రధానేతివృత్తం. తన ప్రతిభా వ్యుత్పత్తులను జోడించి ఈ ప్రబంధాన్ని రసమందరంగా బంధకవితా బంధురంగా తీర్చిదిద్దాడు పెద్దన.

హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో రీడరుగా పనిచేస్తున్న డాక్టర్ రవ్వా శ్రీహరిగారు ఈ గ్రంథాన్ని సంపాదించి, సమగ్రమైన పీఠికను రూపొందించారు.

ఈ ప్రచురణ పాఠకుల ఆదరణకు నోచుకోగలదని మా విశ్వాసం.

తేది. 4-11-1985,

హైదరాబాదు.

తూమాటి దొణప్ప

ప్రత్యేకాధికారి