రసముతో నీకవి మనోహరముగఁ జిత్రించియున్నాఁడు. ప్రతిబింబము లిటు లుండ మాతృక లెటు లుండునో యను భ్రాంతి యీయన కవిత్వ మెల్లరకుఁ గలిగించుచుండును. చూడుఁడు.
ఉ. | ఆనగుమోముచెన్ను శశియందును బంకరుహంబునందు లే | (ఆ. 2. 161.) |
సీ. | మెఱయు క్రొమ్మెఱుఁగులమించును మెలఁతగా మీనకేతనుఁడు నిర్మించినట్లు | |
తే. | విస్మయంబైన లావణ్యవిలసనమునఁ, బొలుచు నమ్మదాలసఁ జూచి భూపసుతుఁడు | (ఆ. 3. 93.) |
ఇట్లే శృంగారరసము నీకవి సర్వాంగవర్ణనము లొనరింపక భారతకవులమార్గము ననుసరించెను ధారాళముగ నీకవికవితాధార తిక్కనసోమయాజి భారతకవిత్వమునకుఁ బోలిక కలదిగఁ గన్పట్టును, వర్ణనాంశములయందు ముఖ్యముగ సోమయాజిభారతభాగముల మనసున నుంచికొని వ్రాసినటుల నుభయగ్రంథములు సమగ్రముగ శోధించినఁ దోఁపకపోదు. నిదర్శనము చూడుఁడు.
సీ. | చంచులఁ జిగురాకుఁ జించి యాడుచు నలి నెలుఁగిచ్చు గండుకోయిలలసొంపు | |
తే. | దరగఁ దేలుచుఁ బూదీఁగఁ దగులుపడుచు, వచ్చుచిఱుగాలి సోకున కిచ్చ మెచ్చి | |
(తిక్కనసోమయాజి. భారతము)
సీ. | విరులగుత్తులమీఁద గురువులు వాఱుచు ముద్దిచ్చు తేఁటుల మొరపములకుఁ | |
తే. | గళవళించుచు గెందమ్మికొలఁకులందు, గేలి యొనరించు జక్కవ మేలిలీలఁ | (ఆ.5.7.) |