పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/68

ఈ పుట ఆమోదించబడ్డది

ఆశీర్వాదం వల్ల, ఆంధ్రప్రదేశ్ అనుగ్రహం వల్ల 1965 సం.న Dr.V.Ananda Murthy Itec Expert గా మా మారిషస్ దేశానికి వచ్చారు. ఈయన మారిషస్ తెలుగు వాళ్ళ భాషా పరిస్థితి బాగా పరిశీలించారు. ప్రాధమిక పాఠశాల గురించి పాఠ్యపుస్తకాలు రాస్తూ, Training College లో విద్యార్ధులకి పాఠాలు చెబుతూ ఉన్నారు. వీటితో సహా శనివారం రోజుల్లో కోరిన ఇతర ఉపాధ్యాయులకి కూడా పాఠాలు చెప్పేవారు. ఈయన నిర్విరామ కృషి గురించి, Dr.V.Ananda Murthy గురువుగారిని మేం మరువలేము. ఈయన ప్రోత్సాహం వల్లనే కొందరు మిత్రులు G.C.E. పరీక్షలో పాల్గొని ఉత్తీర్ణులయ్యారు. దీని గురించి మాకు ఇంకా ప్రోత్సాహం కలిగింది. ఇట్లాంటి విద్వాంసులు, భాషాభిమానులు మా మధ్యలోకి వస్తే మన తెలుగు భాష ఈ దేశంలో తప్పకుండా ప్రగతి చేస్తుందనీ, మన తెలుగు తల్లికి జయం ఔతుందనీ, మన తెలుగు తల్లికి మల్లెపూదండ అందుతుందని చెప్పగలము.

Dr.V.Ananda Murthy గురువుగారు Secondary లో ప్రాధమిక పాఠశాల గురించి పాఠాలు రాస్తుంటే వాటిని టైపు చేసేవారు. ఎవరూ లేరు కాబట్టి ఈయన కోరిక ప్రకారంగా శ్రీ సోమయ్యగారిని M.G.I.కి రప్పించి టైపు చేయమన్నారు. కొన్ని నెలల తర్వాత Dr.V.Ananda Murthy గురువుగారు Secondary School లో ఈ తెలుగు భాషా బోధన గురించి వాళ్ళకి చెబితే 'సరే' అని ఒప్పుకొని, వెంటనే వీళ్ళు మారిషన్ లో తెలుగు భాషా బోధన గురించి సోమయ్యగారిని నియమించారు. ఇలా శ్రీ సోమయ్యగారు మొట్ట మొదట Telugu Typist. మరీ మొట్టమొదలు కళాశాల ఉపాధ్యాయుడుగా 1978 లో నియమింపబడ్డారు.

1982 సం॥ న. Dr.V.AnandaMurthy గురువుగారు ఆంధ్ర ప్రదేశానికి తిరిగి వెళ్ళి పోయారు. అప్పుడు మాకు మార్గదర్శకులు ఎవరూ లేరు. మారిషన్ తెలుగు భాష మళ్ళీ అంధకారంలో పడి నట్లయ్యింది. ప్రాధమిక మరియు కళాశాల గురించి పాఠ్యపుస్తకాలు రాసే తగిన విద్వాంసులు లేరు. ఇది మాకు చాలా నిరుత్సాహం కలిగిస్తుంది. మా మారిషస్ ప్రభుత్వం వారి ప్రోత్సాహం లేకపోతే ఓ 50 సంవత్సర అవధిలో మా మారిషస్ దేశంలో తెలుగు భాష పోతుందని అనుమానంగా ఉంది. దీనితో మన తెలుగు తల్లికి మల్లెపూదండ బదులుగా తగిన చోట ఉండక పోవచ్చు అని నాకు తోస్తుంది.

మా తాత ముత్తాతల స్వర్ణ భూమియైన ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చిన మా పెద్దలకు ఒక మనవి

మా మారిషస్ దేశానికి అపుడపుడు తగిన విద్వాంసులని పంపిస్తే, వలసిన