పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/58

ఈ పుట ఆమోదించబడ్డది

మూడవదశలో వలసదారులందరూ ఇంగ్లీషులోనూ, మాతృభాషలోనూ నిష్ణాతులవుతారని, నాలుగవదశలో ఇంగ్లీషు మాతృభాషను పూర్తిగా స్థానాంతరం చేస్తుందని, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తెలుగువారి పరిస్థితి నాలుగవ దశలో ఉందని శ్రీమతి వారిజా ప్రభాకర్ వివరించారు.

దక్షిణాఫ్రికా వలసదారులకు వారి ఆర్ధిక సామాజిక పురోగతికి జనసామాన్య భాషగా ఇంగ్లీషు నేర్చుకోవటం ఎంతో అవసరం. ఇంగ్లీషు తెలిసినవారు త్వరితగతిని ఆభివృద్ధి చెందుతున్నారు. వలసదారుల మాతృభాషకు సామాజికంగా ప్రాముఖ్యం లేనందువలన అంతా ఇంగ్లీషులోనే మాట్లాడుతూ, ఏకభాషా సంచాలకులుగా మారుతున్నారు. ప్రస్తుతము దక్షిణాఫ్రికాలో ఆంధ్రుల పరిస్థితి ఇదేనని శ్రీమతి వారిజా తెలిపారు.

అంతేకాక భారతీయ వలసదారులలో అల్పసంఖ్యాకులయిన తెలుగువారు, అధిక సంఖ్యాకులయిన తమిళులతో సాంఘిక సాంస్కృతిక కలయిక ప్రభావాల మూలంగా తమ ఉనికిని కోల్పోయి తమిళులతో విలీనం అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆమె చెప్పారు.

దక్షిణాఫ్రికా ఆంధ్రులు తమ మాతృభాష పూర్తిగా అంతం కాకుండా కాపాడుకునేటందుకు మత, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కృషి చేస్తున్నారని, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోడ్పాటు నందిస్తే దక్షిణాఫ్రికా ఆంధ్రులు తమ భాషా సంస్కృతులను కాపాడుకోవటానికి శక్తి వంచన లేకుండా కృషి జరపడానికి సంసిద్దులుగా ఉన్నారని శ్రీమతి వారిజా ప్రభాకర్ వివరించారు.

మారిషస్‌లో తెలుగు భాషా వికాసం

'మారిషస్‌లో తెలుగు భాషావికాసం' గురించి శ్రీ రెడ్డిలక్ష్ముడు(మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్) సోదాహరణంగా వివరించారు. వారి ప్రసంగంలో కొన్ని విశేషాలు బొక్కెడు బువ్వతో ఎల్ల కష్టముల్ మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తులై పరిక, పుస్తకాలు లేకుండా పూర్వీకులు తాటాకులపై రాసి తెలుగు భాషను రక్షించి, బోధించారు. మారిషస్‌లో ఆంధ్రులు విరామ సమయంలో సముద్రతీరాన ఇసుకతిప్పలలో తెలుగు అక్షరాలు వ్రాసి తేనెలాంటి ఈ తెలుగు భాష తమ పిల్లలకి బోధించారని చెప్పారు.

తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలను ఆచరించి తెలుగు భాషలో అన్ని కార్యక్రమాలనూ చేసి రెక్కల కష్టాలతో ప్రచారం చేశారు. అట్లా ఈ దీవిలో తెలుగు