పుట:మాటా మన్నన.pdf/7

ఈ పుట ఆమోదించబడ్డది

గుహలో నివసించిన మానవునకు అతని అవసరాలు, అతని లోకము, అంతా అల్పమే. అందుచేతనే అతని ఆలోచనలు చాలా తేలికైనవి. అతని జ్ఞానం స్వల్పం. అతని మేధ పెరగ లేదు. అతనిది కొంచపులోకం . కనుక ఆ సంఘానికి కొద్దిపాటి సంభాషణే అవసరమైనది. కాని ఈ నాటి లోకం అతివిశాలం. అయినప్పటికి అందరూ అన్ని విషయాలు తెలసినవారుకారు. ఏదో విషయం అధికంగా తెలిసిన వారున్నారునేడు. కనుక మన జ్ఞానాభివృద్ధికి ఈ అందరితోను సంభాషించటం అవసరం. దేశాటనం, వారాంగనా పండిత మిత్ర సంభాషణ అవసరమన్నారు పూర్వులు. వారాంగనలు ఈ నాటివారివలె కేవలం శరీరాన్ని అర్పించే వారు కారు. వారు సమస్త విద్యల్లోనూ ఆరితేరిన వారు. అందుచేతనే వారిని కళావంతులు అన్నారు. కనుక వారితో మాట్లాడటమే విద్య.

పల్లీ యుల సంబంధం పరిమితం, వారు తోటివారితోను, వైద్యుడు, పురోహితుడు, టపాబంట్రోతు మొదలగు కొద్దిపాటి మిత్రులతో సంభాషింతురు.

కాని పట్టణవాసి అసంఖ్యాకులతో ముచ్చటించాలి. కనుక భావాలను సరిగా వెల్లడించటానికి సంభాషణ అవసరం. డాక్టరులతో తన జబ్బును, వర్తకునితో తన అవసరాలను, వకీలుతో తన తగాదాలను, కూలీలతో తన పనులను చెప్పవలసివున్నది.

వేయేల? మాటవల్ల నేగదా మైత్రి. మాట లేని వాని బ్రతుకు బ్రతుకుకాదు. కనుక సంభాషణ విలువ అంతా

6