పుట:మాటా మన్నన.pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. ఎదిరిమనంబు నోవనటు లెంతయు నింపుగఁ బల్కు వారలం
    బదుగురు గారవింపుదురు; ప్రల్ల దులం దరిఁ జేరనిత్తురే?
    ముదమునఁ గీరశారికల ముద్దుగఁబంజరమందు నుంచి పెం
    చెద; రలకాకులం జెదరఁ జేయ రె చీఁదరఁ జెంది ? మిత్రుఁడా!

చ. సమయ మెఱింగి పల్కు విలసన్మృదువాక్కులు వోలేఁ దీవ్రవా
    క్యము లొనరింపనేర వొడికంబుగఁ గార్యపుసిద్ధి; నెట్లనం,
    బ్రమద మెసంగ రాల్చును బ్రభాతపుశీతలవాత పోతముల్
    సుమఫలముల్ ; శలాటువుల డుల్చునుగా పెనుగాలి! మిత్రుఁడా!

చ. వ్యపగతమార్దవంబులు మహాప్రియముల్ సమయానుకూల మౌ
    లపితము, లట్లుకాని మృదులంబులు నప్రియముల్ నుడుల్; ప్రభా
    తపుఁదఱిఁ గాక కుక్కుటరుతంబు హితం బగు నెంతయన్; వియో
    గపు సమయంబునన్ శుకపికస్వర మార్తికరంబు; మితుడా!

61