పుట:మాటా మన్నన.pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కం. మనమునకుఁ బ్రియంబును హిత
     మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
     బును బరిమితమును నగు పలు
     కొనరఁగఁ బలుకునది ధర్మయుతముగ సభలన్.

కం. చెలిమియు సంభాషణమును
     బలిమి వివాదంబు ద్రోపుఁ బాడియుఁ దమయం
     తల వారితోన తగు నధి
     కుల హీనుల తోడనైనఁ గొఱగాదధిపా!

కం. మృదుమధుర వాక్యముల నిం
     పొదవెడు చిఱునవ్వుతోడ నుర్వీశుఁడు స
     మ్ముదము సచివులకుఁ బ్రజలకు
     నొదవింపఁగ వలయునది మహోన్నతి చేయన్ ,

తే. ఈగియును బ్రియవచన సంయోగమునన
    కాని జనులకు సంతోషకారి గాదు
    పుచ్చికొ'నునప్డు పల్కుల పొందు గలిమి
    యెదిరి మదిగంద నీదింత యెఱుఁగు మధిప!

ఆ. వె. మాటమిగులు టొకటె దాఁటి చూపుటకాదు:
        మాటపడినవాఁడు మఱచిపోఁడు,
        మాట కఱకుఁదనము మనలనే నఱకురా?
        వాస్తవమ్ము నార్ల వారి మాట

59