పుట:మాటా మన్నన.pdf/46

ఈ పుట ఆమోదించబడ్డది

మరికొందరు ఈ కాలగమనాన్ని గమనించక మడీ దడీ అంటూ కూపస్థ మండూకంలాగా ముడుచుకొని కూర్చుంటారు, మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోతా యనుకొంటారు.

రైలు ప్రయాణాల్లో రాక్షసులను దేవతలను చూడగలం. .

ఇంకా ఈ ప్రయాణాల్లో ఇతర ప్రాంతీయులను కలుసుకొని ఆ దేశాచారాలను, అక్కడి పాడిపంటలను తెలుసుకొని తద్వారా లోకానుభవాన్ని గాంచగలం.

రైళ్ళల్లోను, బస్సుల్లోనేగాక, తీర్థయాత్రల్లో కూడా సంభాషణ ద్వారా మనం నూతన మిత్రులను పొందటానికి అవకాశం కలుగుతుంది.

పిన్నా పెద్దల సంభాషణ :

సాధారణంగా పెద్దలతో మాట్లాడటానికి పిన్నలు శ్రద్ధవహించరు. కుటుంబాల్లో అయితే పిన్నలు పెద్దలతో మాట్లాడటం తప్పనిసరిఅవుతుంది. పెద్దలకు తమకు అభిరుచుల చేత, అంతరాలచేతగల వ్యత్యాసాన్ని గుర్తించుటకు పెద్దలలో సంభాషించుట ఆమోదప్రదమని కొందరు యువకు లనటం కూడా కద్దు. యువకులు సాధారణంగా తమకంటె ముందు తరంవారి అనుభవాలను, అభిప్రాయాలను, అభిరుచులను, పెంపకంలోగల తారతమ్యాలను వినగోరతారు; కాని మరొక విషయం గమనించవలసి ఉంటుంది. నాటికీ నేటికీ గల తారతమ్యాన్ని పోల్చి చూపుటకు వారు ఇష్టపడరు. వారి కది అనుకూలంగా ఉండదు. ఈనాటి యువకులు నా

45