పుట:మాటా మన్నన.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

తారంటే ఆశ్చర్యమేమిటి? స్త్రీ ఘర్కీరాణి, గృహలక్ష్మి గృహదేవత. ఆందుచేతనే ఇల్లుచూచి ఇల్లాలునుచూడమన్నారు. ఇల్లాలే ఇల్లు. 'నగృహమ్ గృహమిత్యాహు గృహిణీ గృహముచ్య తే.'

ఆమె తమ పిల్లలను గురించి మాట్లాడుతుంది. వారి విద్యా బుద్ధులను గురించి ముచ్చటిస్తుంది. అంటే ఇందులో తప్పేమున్నది ! ఆమె నవమాసాలు మోసి కన్నది. స్త్రీకి సంతానమం దుండే ప్రేమకంటే అధికం మరొకటి లేదు. పిల్లలకై తల్లి సర్వస్వమూ త్యజిస్తుంది. గృహసంబంధమైన విషయాలు మాట్లాడుకోవటంలో వారు కొందరికి సలహా లిస్తారు. మరికొందరి సలహాలు పొందుతారు. ఈవిషయంలో సిగ్గుపడవలసిందేమీ లేదు. అయినప్పటికీ ఇదంతా సంభాషణ అనిపించుకోదు. సంభాషణ నిజంగా నవ్యభావోదయం ద్వారా సంతోషం కలిగించాలి. గృహసంబంధమైన మాటలు ఆపని చేయలేవు. సంభాషణానంతరం “సంభాషణ చాలా బాగున్నది, సంతోష ప్రదమైనది" అనే భావాన్ని కలిగించాలి.

కొందరు పురుషులు స్త్రీలను చాలా చెడ్డగా చిత్రించారు. ఆడదాని నోటిలో నూవుగింజ నానదని, ఆడబుద్ధి అపరబుద్ధని, ఆడది గాడిదని, స్త్రీబుద్ది ప్రళయంకరి, కోడిపుంజూ ఒక పిట్టేనా, ఆడదీ ఒక మనిషేనా అని. ఇదంతా ఇప్పుడు మారుతున్నందుకు సంతోషం.

స్త్రీలు సాంఘిక ఆర్థిక రాజకీయ విషయాలను గురించి మాట్లాడుకోరని ఆక్షేపించటం ఎందుకు ? అందులో వారికి

37