పుట:మాటా మన్నన.pdf/35

ఈ పుట ఆమోదించబడ్డది

చాలామంది మగవారు వింటూఉంటారు. అది సంభాషణ అనిపించుకోదు.

స్త్రీలు అట్లాకాదు. పురుషులు మాట్లాడుతుంటే మందహాసం చేయటమో, సంతోషం వెలిబుచ్చటమో ఏదో చేస్తూ ఉంటారు. స్త్రీలుగాని ఆడపిల్లలుగాని మాట్లాడటం ఆరంభించారంటే గబగబ మాట్లాడుతారు. అదంతా ఆలోచన లేకుండా బిడియంచేత కలిగిందే. క్రమంగా వారు కూడా కొంతకాలానికి ఆలోచించే సంభాషించటానికి ప్రయత్నిస్తారు.

స్త్రీ పురుషులు మాట్లాడుకోవటంలో ఒక చిక్కు ఉంది. పురుషులు సహజంగా తమ కిష్టమైన ఆటపాటలను గురించి ఆరంభిస్తే స్త్రీలు తమ పిల్లామేకనుగురించి చెప్ప సాగుతారు. ఇదంతా అందరకూ ఆమోదంకాదు. కొంచెం వయసు మిగిలినవారు కుటుంబవిషయాలంటే ఇష్టపడతారు.

స్త్రీలలో మరొకసంగతేమిటంటే ఏమన్నా పిల్లలా? అని తప్పకుండా అడుగుతారు. అది పూర్వాచార పరాయణులకు ఇష్టమేకాని నవనాగరికులకు అంత ఇష్టంగాఉండదు. ఒక వేళ పిల్లలు లేకపోతే ఆమె చాలా నొచ్చుకోవచ్చు. ఏమైనా స్త్రీలు విశేషంగా తమపిల్లలసంగతి చెప్పుకోకుండా వుండటం మంచిది. ఎందుకంటే, ప్రతివారూ తమ పిల్లల సంగతి చెప్పతలుస్తారు. అందుచేత సోది వింటానికి ఇష్టం ఉండదు.

స్త్రీ పురుషులు, సంభాషణలో తమ భావాలను వెలిబుచ్చుకోవటానికి అవకాశంగా భావించుకోవాలి. గృహ

34