పుట:మాటా మన్నన.pdf/25

ఈ పుట ఆమోదించబడ్డది

సంభాషణ అంటే:

Conversation is a mutual meeting of minds says one writer, not a monologue but a reciprocial exchange of ideas, conversation is a give and take process.

సంభాషణోద్దేశము - అభిప్రాయ వినిమయము :

(exchange of thoughts)

ఆనందానుభవమే సంభాషణోద్దేశముగాదు. ఒకరి అభిప్రాయాలను మరియొకరు తెలిసికోవటమే సంభాషణ. మాట్లాడుతున్న వారినుండి ఏదో కొంత గ్రహించి జ్ఞానాన్ని అభివృద్ధి గాంచాలి. ఆ మాట్లాడే వారిని నిర్నిరోధంగా మాట్లాడ నివ్వాలి. లేకపోతే వా రభిప్రాయాలు, అభిరుచులు, అనుభవాలు మన కెట్లా తెలుస్తాయి?

ఇతరులకు అవకాశమివ్వకుండా ఒక్కరే మాట్లాడటము వాగుడు క్రింద లెక్క. అందులో అభిప్రాయ పరివర్తన కవకాశం లేదు. అభివృద్ధికి ఆధారంలేదు. అతడెంత గొప్పవాడైనా ఒక్కరే మాట్లాడటం, ఇతరులను నోరు మెదపనివ్వకుండా వినిపించటమనేది మంచిపద్ధతికాదు. ఆ మాట్లాడేవ్యక్తి “నాకు ఇందులో మంచి అనుభవమున్నది. నేను చెపుతాను విను" అనటం సంభాషణా పద్ధతికాదు. ఇద్దరు కలసి మాట్లాడేదే సంభాషణ, అదే సజీవ సంభాషణ.

ఇతరులతో సంభాషించేటప్పుడు, మన అభిప్రాయాలను పరులపై రుద్ద ప్రయత్నించటం మంచిదికాదు. మంచి సంభాషణ కర్తగా మనవలెనంటే, ఇతరుల అభిప్రాయాలను

24