పుట:మాటా మన్నన.pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

స్టులు ఒక వస్తువునుగురించి తీవ్ర పరిశోధనచేసి ఎట్లా తెలుసుకుంటారో అట్లా మనం కృషి, చెయ్యాలి.

మన సొంత అభిప్రాయాలు చెప్పేటప్పుడు దానికి తగిన ఉపమానమో తదనుగుణ్యమైన పరాభిప్రాయమో చెపితే బాగుంటుంది. ఈమాదిరి సంభాషణ ఎప్పుడు అధిక ఆకర్ష వంతంగా వుంటుంది.

మధురంగా మాట్లాడటం :

"కాకేమి తన్ను దిట్టెనె? కోకిల తన కేమి ధనము కోకొమ్మనెనే! లోకము పగయగు ఒరునని, వాకున, జుట్టమగు మధుర వాక్యమువలనన్ .” రసములలో మధురరసం అధికమైనది. దీనివల్ల చిత్తము ప్రసన్నమవుతుంది. మాధుర్యమంటె ఎటువంటి కఠినమూ కానిది. పంచేంద్రియాలలో దేనికైనను మాధుర్యము కలుగవచ్చు. సుందరవస్తువును చూచినపుడు నేత్రములద్వారా అది రూపమాధుర్యమగును. శ్రవణ పేయమైన మాటలు వింటూఉంటే శబ్దమాధుర్యమగును. ప్రసాదము, ఓజస్సు, మాధుర్యము కవితాగుణములకు మాధుర్యము అన్నారు. జయదేవుని గీతగోవిందం కోకిలస్వరమే కనుక మాధుర్యము అన్నారు.

మాధుర్యం కావ్యంలోనే కాదు కావలసింది; లోక సంబంధంలోకూడా. సంభాషణలో మృదుమధురంగా మాట్లాడటమే మాధుర్యం.

మాటలలో ఎంత ఆకర్షణశక్తివున్నదో సాధారణులు ఎరుగరు. న్యూటను ఆకర్షణశక్తికన్నా అధికంగా వున్నది . దేనిలో శబ్దాకర్షణశక్తి ఎంత అధికమో దాని ప్రభావం

21