పుట:మాటా మన్నన.pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

మర్యాద ఇచ్చి మర్యాద తెచ్చుకో మన్నారు . మర్యాదనేది దానంతట ఎవరికీ అది రాదు. మర్యాదవల్లనే లభిస్తుంది.

కాలు జారితే తీసుకోవచ్చును గానీ నోరు జారితే తీసుకోలేం .

నరం లేని నాలుక అని ఎట్లాబడి తే అట్లా మాట్లాడ రాదు.

నాలుక స్వాధీనంలో వుంటే నరలోకమంతా స్వాధీన మవుతుంది.

నేర్పరత్వం :

సంభాషణ సరసంగా వుండాలంటే నేర్పరత్వం అవసరం, మనం ఏదో తొందరలో వేడితో మాట్లాడుతాం. ఆ మాటవల్ల ఎవరి హృదయానికై నా నొప్పి కలిగిందేమో నని గమనించాలి. గమనిస్తే వెంటనే ఆ విషయాన్ని మార్చి వెయ్యాలి.

పదిమందిలో క్షమాపణ కోరటం పుండుపై కారం చల్లినట్లవుతుంది. అవసరమైతే ఒంటరిగా వున్నప్పుడు క్షమాపణ చెప్పటం మంచిది.

సంభాషణలో వివాదాస్పదమైన విషయాలు, వ్యక్తిగత విషయాలు విడువటం మంచిది.

నిజాయితీ :

మర్యాద నేర్పరత్వాన్ని పాటించవలసిందని చెప్పిన తరువాత సంభాషణలో నిజాయితీ అవసరమనీ చెప్పవలసిన

19