పుట:మాటా మన్నన.pdf/18

ఈ పుట ఆమోదించబడ్డది

ధనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో అంతకంటే పొదుపుగ మాట్లాడటం నేర్చుకోవాలి. అట్లా మాట్లాడితే వినేవారికి సొంపుగా ఉంటుంది. కాలహరణం వుండదు. సాధ్యమైనంతవరకు సంగ్రహంగా మాట్లాడటం ఉభయ తారకం.

నిరాడంబరం:

నిరాడంబరత్వం కళలన్నిటికి మూలసూత్రం. ఆడంబరం లేనిమాట అందరిని ఆకర్షిస్తుంది. - గాంధీమహాత్ముని మాటలు బహు నిరాడంబరంగా వుండేవి. గొప్పవారి గుణమే అది. భగవాన్ రమణమహర్షి అంతే. వారి పలుకెంత ఆడంబర రహితంగా ఉండేదో అంత అందంగా వుండేది.

సంభాషణలో వాగాడంబరం, పాండిత్య ప్రకర్ష చూపటం, గ్రాంధికంగా మాట్లాడటం పనికిరావు. ఏదైనా విద్యద్గోష్ఠి జరిగినపుడు కొంతవరకు సమయోచితంగా మాట్లాడవచ్చు.

తమ గొప్పదనాన్ని చూపెట్టుటకు కొందరు గూడార్థాలతో మాట్లాడతారు. అది మంచిపనిగాదు. సంభాషణ ఎంత సంగ్రహంగా, సుబోధకంగా ఉంటే అంత మంచిది. నాటక రచన గొప్పగా భావించబడుటకు కారణము ఇదే, సంభాషణ సహజంగానూ, సంగ్రహంగానూ వుండాలి.

“Be simple, uneffected; be honest in your speaking and writing. Never use a long word when a short one will do........ Where a

17