పుట:మాటా మన్నన.pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది

కనుక సంభాషణలో ప్రధానమైనది. చిరునవ్వు. నవ్వుతూ మాట్లాడుతుంటే సమాధానం నవ్వుతూ చెపుతారు. ఇది నిత్య జీవితంలో రాజమార్గం.

నవ్వుతూ మాట్లాడేవారిని అందరూ ప్రేమిస్తారు. అతను అధికంగా స్నేహితులను అందువల్ల సంపాదించుకొంటాడు. అందరకూ మంచివా డవుతాడు.

ఆదరాభిమానాలను అందుకోవడానికి ఈ లోకంలో ఉన్నదల్లా చిరునవ్వు ఒక్కటే. ఈ దరహసిత వదనం జ్యోతిలాగా ప్రజ్వరిల్లి తన కాంతిచేత ఎనలేని ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

అందుచేత మిత్రులు కనబడగానే చిరునవ్వు నవ్వాలి. అది మాటలకంటె అధిక ప్రయోజనకారి

ఇతరులను చిరునవ్వుతో పలకరించడం నేర్చుకుంటే, ప్రపంచంలో చిర చిరలాడే ముఖం ఉండదని ఒక నుప్రసిద్ధ ఆంగ్లేయుడు అన్నాడు.

స్పష్టత :

మనం మాట్లాడేది అవతలవారికి తెలిసేటట్లు చెప్పవలసి ఉంటుంది. మనస్సులోని సంగతి యితరులకు తెలిసేటట్లు చెప్పకపోతే ప్రయోజనమేమి ?

తెలిసేటట్లు మాట్లాడటానికి ముందు మనం మాట్లాడే సంగతి మనకు బాగా తెలియాలి. మన అభిప్రాయాల్లో తికమకలు ఉంటే, వినేవారికీ ఎట్లా తెలుస్తుంది ? కొందరికి మంచి అభిప్రాయాలు ఉంటవి. కాని అవి ఇతరులపై

15