పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/82

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

67


ఆచచక్షే తత స్పర్వ మితిహాసం పురాతనమ్ !" (ఆది. అ60 )

అనుటను బట్టి వ్యాసమహర్షి శిష్యుడగు వైశంపాయనునకు, 'ఇది వరలో నాయొద్ద నీవు చదువుకొనియున్న దాని నంతను ఈజనమేజ యునకు నీవు చెప్పు'మని యాజ్ఞాపించి వైశంపాయను డప్పుడు పురా తనమైన ఇతిహాసమును సర్వము వినిపించినట్లుండుటచేతను అసమయ మం దక్కడనే యుండి ఇతిహాసము నంతను విని శౌనకసత్రమునకు వచ్చిన సౌతిని శౌనకాదు లాదరెంచి యెక్కడనుండి యీరాక యని యడిగినపుడు అతడు చెప్పిన సందర్భమున జనమేజయసర్పసత్రము సందు వ్యాసప్రోక్తములై వైశంపాయనునిచే వినిపింపబడిన మహా భారతగాధలను విని యిట్లు పచ్చితి నని చెప్పగా ఋషులు ----

     “ద్వైపాయనేన యత్ప్రోక్తం పురాణం వరమర్షిణా |
     సురై బ్రహ్మర్షి భిశ్చైవ శ్రుత్వా యదభిపూజితమ్ |
     తస్యాఖ్యానవరిష్ఠస్య విచిత్రపదపర్వణః !
     భారత స్యేతిహాసస్య పుణ్యాం గ్రన్థార్థసంయుతామ్ !
     జనమేజయస్య యాం రాజ్ఞో వైశంపాయన ఉక్తవాన్ |
     వేదై శ్చతుర్భి స్పంయుక్తాం వ్యాస స్యాద్భుతకర్మణః |
     సంహితాం శ్రోతు మిచ్ఛామః పుణ్యాం పాపభయాపహామ్!(ఆ1అ)

అనుటనుబట్టి వైశంపాయనుడు వినిపించిన ఆవ్యాసప్రోక్తభారత మునే మాకు వినిపింపు మని సౌతిని కోరగా దానినే సౌతి వినిపించిన ట్లుండుట చేతను, ఆభారతేతిహాసముయొక్క నూరుపర్వములు చెప్పుటలో

    “భారత స్యేతిహాసస్య శ్రూయతాం పర్వసంగ్రహః |
    పర్వానుక్రమణీ పూర్వం ద్వితీయః సర్వసంగ్రహః |
    పౌష్యం పౌలోమ మాస్తీక మాది రంశావతారణమ్ !
    తత స్పంభవపర్వోక్త మద్భుతం రోమహర్షణమ్|| "