పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/75

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

మహాభారతతత్త్వ కథనము

శ్లోకమందు ఈయనుక్రమణికాధ్యాయములోని గాధకు జయమని పేరు గలదని చెప్పబడినదట. వారన్న ఆకడపటి శ్లోక మిదిగో -

“ఏవ మేత త్పురావృత్తం తేషా మక్లిష్టకర్మణామ్ |
భేదో రాజ్యవినాశశ్చ జయశ్చ జయతాంవరః ||"

ఇంతకు పూర్వగాథలో జనమేజయునితో కురుపాండవులకు రాజ్యార్థమై ద్యూతప్రయుక్తమైన కలహము, వనవాసము, యుద్దము, ఎట్లయినదో చెప్పుచున్నాను విను మని వైశంపాయనుడు మ ముగా చెప్పుకొనివచ్చి యీకడపటిశ్లోకమునకు వెనుక --

“తతస్తే క్షత్ర ముత్సాద్య హత్వా దుర్యోధనం నృపమ్ |
రాజ్యం విహతభూయిష్టం ప్రత్యపద్యన్త పాండవాః || "

ఆపొండవులు సపరివారముగా దుర్యోధనుని వధించి రాజ్య మును పొందిరి. అని చెప్పి కడపటి శ్లోకముతో వారి కీవిధముగా విరోధము, రాజ్యనాశనము, జయము కలిగిన దని చెప్పిను.

ఇట్లు పాండవులకు గలిగిన జయముమాట శ్లోకములో జెప్ప బడియుండగా నాయధ్యాయములోని గాధకు జయ మని పేరు చెప్ప బడిన దనుట యెంతమోసమో చూడుడు. ఇట్టి యర్థరహితమైన ప్రతి వాదుల వ్రాతలు విమర్శనములట. ఇట్టి విమర్శనశక్తి విద్వాంసులకు లేదట. ఇటువంటి విమర్శనశక్తి విద్వాంసుల కుండదన్న మాట నిజము. వారికుండెడిది యిట్టి దుర్విమర్శనములను ప్రమాణోపపత్తు లతో విదళించెడి శక్తి. ఇక దీనిని విడిచి మరియొక విషయ మను కొందము.-----

ఈ మహాభారతములో ప్రథమాధ్యాయము అనుక్రమణికా పర్వము. ద్వితీయాధ్యాయము పర్వసంగ్రహ పర్వము. ఈరెండధ్యా యములలో గూడ భారతకథాసంగ్రహమే ప్రతిపాదింపబడినది. అందు