పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/59

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

మహాభారతతత్త్వ కథనము

ఒకవేళ పి .పి. శాస్త్రిగారి పాఠమే ప్రమాణ మని మ||భా|| చ|| కారు లందురేని “వ్యాసుని గ్రంథము 8800 మాత్ర మే" అను తమ వాదమునకు ప్రమాణముగా నీయబడిన “గ్రన్థగ్రంథిమ్” "అష్టౌ శ్లోక సహస్రాణి" అను శ్లోకములు గణేశవృత్తాంశఘటకములును పి. పి. శాస్త్రిగారి పాఠములో లేనివియు గనుక తమవాదమునకు ఆఘాతమే. ఆవాదము నిలవబెట్టుకొనుటకు గణేశవృత్తాంతము నంగీకరింతురా? అప్పుడు పి. పి. శాస్త్రిగారి పరిష్కరణమును బట్టి గణేశవృత్తాంతము ప్రక్షిప్త మను తమవాదమునకు ఆఘాతము. ఇది ప్రతివాదులకు 'ఉభ యత స్స్ఫాశా రజ్జుః' అన్నటు లైనది.

ఇట్లు 'విఘ్నేశ్వరుడు లేఖకుడా ' అను వ్యాసములోని యొక కారణము విగళిత మైనది. మరియొక కారణము పరిశీలింపవలసియున్నది.

(2) "లిపి శాస్త్రజ్ఞులు ప్రాచీనయుగములలో భరతఖండ మున లిపి లేదనియు, అప్పటిపూర్వులు గురువుచెప్పగా శిష్యులు విని వల్లించుకొనువారె యనియు, అందువలననే భారతీయుల ప్రాచీనగ్రంథము లగు వేదములకు శ్రుతులు అను పేరు కల్గె సనియు చెప్పుచున్నారు. ఇందుకై ఆంధ్ర విజ్ఞానసర్వస్వములోని 'అక్షర' వ్యాసము చదువదగినది. ఇందువలన విఘ్నేశ్వరుడు భారతసంహితను వ్రాసె ననుట పొసగదని చెప్పవలసియున్నది'

ఈ ప్రతివాదులకు ప్రాచీనయుగములలో లిపి యున్నదో లేదో చూపుదము.--

రామాయణము, సుందరకాండము. స.36.

"వానరో౽హం మహాభాగే! దూతో రామస్య ధీమతః |
రామనామాంకితం చేదం పశ్య దే వ్యంగుళీయకమ్ !”