పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/56

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

41


గణేశలేఖకత్వసమర్థనము

ఇట్లు మనము మ |భా | చ ! కారుల వాదమును పరీక్షించుటలో మహాభారతమునకు లేఖకుడు గణపతి యని సిద్ధించినది యిట్లుండ మ భా/చ! కారు లే 13_1_46 అంధ్రపత్రిక లో విఘ్నేశ్వరుడు లేఖకుడా?? అని యొక వ్యాసము ప్రకటించి అందు 'విఘ్నేశ్వరుడు లేఖకుడను గాధ ఇటీవల సంస్కృత భారతమున గూర్పబడెను' అని వ్రాసి కొన్ని కారణములు చూపినారు. వానిని పరిశీలింతము.

(1) "విఘ్నేశ్వరుడు భారతసంహితను వ్రాసినయంశము దాక్షిణాత్య భారతపుప్రాచీనప్రతులలో లేదనియు ఔత్తరాహుల ప్రతులలోనే ఇటీవల చేర్చబడె ననియు నుదాసు ప్రెసి డెన్సీ కాలేజీ లోని సంస్కృత పండితులగు శ్రీ పి. పి శాస్త్రి గారు తాము , పరిష్కరించిన వావిళ్ళవారి నాగరలిపిభారత పీఠికలో విమర్శించి వాసియున్నారు” అనునది యొక కారణము.

మన మిప్పుడు ఆ పీఠిక లోనే పి. పి. శాస్త్రిగారి కొన్నిమా టలు చూతము:

1854 సం॥ మొదలు 1906 సం|| వరకు దేవనాగరలిపి ఆం ధ్రలిపి గ్రంథలిపులలో ఆరువిధములగు మహాభారతపుప్రతులు ముద్రింపబడినవి ... ఆముద్రింపబడిన ప్రతులారింటిలోను గణేశ వృత్తాంత మున్నది, మేము గ్రహించిన దాక్షిణాత్య శాఖా వలంబి మాతృకలలో గణేశవృత్తాంతము లేదు”

“అస్మాభిశ్చ పరీక్షితాసు వస్తుతో దాక్షిణాత్యాసు బహ్వీషు మాతృకాసు గణేశోపాఖ్యానం నదృశ్యతే! ఇతి గణేశవృత్తాన్తో పన్యాసాభావ ఏవ దాక్షిణాత్యాయ మహాభారతమాతృకా శాఖాయ శ్చిహ్న మితి వక్తుం ప్రభవామః"