పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

మహాభారతతత్త్వ కథనము

యుండ వ్యాసమహర్షి తాసు బుద్ధిస్థముగా జేసియున్న భారతమందు గల విషయములను సంగ్రహముగా చెప్పి--- “పరం న లేఖకః కశ్చి దేతస్య భువి విద్యతే ||"

అని యీ గ్రంథమునకు లేఖకుడు మాత్రము ఇక్కడ లేడని చెప్పగా బ్రహ్మ - ఆ గ్రంథకర్తృత్వమును, మహర్షి యోగ్యతను ప్రశంసించి---

"కావ్యస్య లేఖనార్థాయ గణేశ స్స్మర్యతాం మునే |"

గ్రంథమునకు లేఖకునిగా గణపతిని స్మరింపుమని బోధించి వెళ్లెను,

“తత స్సస్మార హేరంబం వ్యాసస్సత్యవతీసుతః |
స్మృతమాత్రో గణేశానో భక్తచింతితపూరకః || 75 .
తత్రాజగామ విఘ్నేశో వేద వ్యాసో యతః స్థితః |
పూజిత శ్చోపవిష్టశ్చ వ్యాసే నోక్త స్తదానఘ ||
లేఖకో భారత స్యాస్య భవ త్వం గణనాయక |
మయైవ ప్రోచ్యమానస్మ్య మనసా కల్పితస్య చ ||
శ్రుత్వైత త్ప్రాహ విఘ్నేశో యది మే లేఖినీ క్షణమ్ !
లిఖతో నావతిష్ఠేత తదా స్యాం లేఖకో హ్యహమ్ ||
వ్యాసో౽ ప్యువాచ తం దేవ మబుద్ద్వా మాలిఖ క్వచిత్ !
ఓ మి త్యుక్త్వా గణేశో౽ పి బభూవ కిల లేఖకః || " 79.

తరువాత మహర్షి స్మరింపగా వెంటనే దర్శన మిచ్చిన గణపతిని వ్యాసమహర్షి పూజించి 'నా బుద్దిస్థమై నాచే జెప్పబడు భారతమునకు నీవు లేఖకుడవు కావలె' నని ప్రార్థింపగా, గణపతి- 'వ్రాయునపుడు నాకలము క్షణమైనను ఆగకుండెడి పద్దతిని నీవు చెప్పగల వేని నేను వ్రాయుదు' ననగా, వ్యాసమహర్షి - 'నీవర్థము చేసికొనుచు వ్రాసిన యెడల నట్లే చెప్పెద' నని ప్రతిజ్ఞ చేయ దాని కంగీకరించి గణపతి వ్రాసెను.