పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/47

ఈ పుట ఆమోదించబడ్డది

32

మహాభారతతత్త్వ కథనము

(5) “మన్వాది భారతం కేచి దాస్తీకాది తథాపరే |
     తథోపరిచరా ద్యన్యే విప్రా స్సమ్య గధీయతే || (ఆది. 1 అ )

ఈశ్లోకమును మహాభారతమునకు ముగ్గురు కర్తలనుటకు ప్రమాణముగా ప్రతివాదులు ప్రదర్శించిరి.దీనిని పరిశీలింతము.

ప్రతివాదులు -వ్యాసునిది జయమనియు, వైశంపాయనునిది భారతమనియు, సౌతిది మహాభారతమనియు, సౌతి మహాభారతములోనే ఆజయము, ఆభారతము, ఇమిడి యున్న వనియు, వ్రాసి యీ 'మన్వాది భారతమ్' అను శ్లోకమును చూపి యిందు భారతాదిని గూర్చిన మూడు వికల్పములే పైజూపిన గ్రంథములు మూడు కలవనియు, మూడుగ్రంథములకు మూడువిధములైన ఆరంభములు కలవనియు, తెలిసికొనుటకై యూత యగుచున్న వనియు వ్రాసిరి. వారి నొకింత యడుగవలసి యున్నది.

మీ నిర్ణయప్రకారము వ్యాసుని జయములో వైశంపాయనుని భారతము కాని, సౌతి మహాభారతము కాని అంతర్భూతముగా లేదనియు, వైశంపాయనుని భారతములో వ్యాసుని జయ మంతర్బూతమైయున్నను, సౌతి మహాభారత మంతర్బూతముగా లేదనియు, సౌతి మహాభారతములో మాత్ర మాభారతము, ఆజయము అంతర్భూతములై యున్నవనియుగదా తేలుచున్నది. ఈ స్థితిలో 'మన్వాదిభారతం కేచిత్ ' అను శ్లోకము భారతశబ్దనిర్దేశముచే వైశంపాయనభారతము యొక్క ఆరంభప్రభేదములనే చెప్పుచుండ భారత మహాభారతములు భిన్నగ్రంథము లను మీ సిద్ధాంతములో మహాభారతారంభప్రభేదములను చెప్పుచుండె ననుటెట్లు ?

మఱియు మహాభారతాంతర్గతమగు వైశంపాయనభారతము యొక్క ఆరంభమే మూడువిధములుగా నున్నట్లు ఈశ్లోకముచే గ్ర