పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/46

ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

31

చెప్పుచు వచ్చి, 'ఏకం శతసహస్రంతు మయోక్తం వై నిబోధత' | (109) అని చెప్పెను.ఈ సందర్భమును పరిశీలింపగా వ్యాసప్రోక్త మహాభారతమును సర్పసత్రములో వైశంపాయనుడు జనమేజయునకు వినిపింపగా నేను విని క్రమముగా నిక్కడకు వచ్చితినని సౌతి చెప్పిన మాటమీద ఋషులు మీరు విని వచ్చిన ఆ వ్యాసప్రోక్త మహాభారతమునే మాకు చెప్పుమని కోరిన మిదట చెప్పుట కుపక్రమించిన ఆ సౌతి ఆవ్యాసప్రోక్త మహాభారతమునే ఋషిప్రశ్నానుగుణముగా శౌనకాదులకు చెప్పినట్లు స్పష్టమగుచుండ దీని నంతను కప్పిపుచ్చి 'ఏకం శతసహస్రంతు మయోక్తం వై నిబోధత' అను వాక్యమును మాత్రము చూపి దీనిని బట్టి సౌతి లక్షగ్రంథమగు మహాభారతమునకు కర్తయని వ్రాసిన ప్రతివాదు లెంతమోసము చేసిరో చూడుడు!

మఱియు సౌతియే ఋషిప్రశ్నానుసారము తాను చెప్పబూనిస,మహాభారతేతిహాసమునకు కర్త వ్యాసమహర్షి యని చెప్పెను, చూడుడు!-

"ఇదం తు త్రిషు లోకేషు మహజ్ఞానం ప్రతిష్టితమ్ |
తపసా బ్రహ్మచర్యేణ వ్యప్య వేదం సనాతనమ్ !
ఇతిహాస మిమం చక్రే పుణ్యం సత్యవతీసుతః |" (ఆది. అ. 1)

ఇట్లు పరీక్షింపగా మహాభారతములో వైశంపాయనునకు గాని, సౌతికి గానీ కర్తృత్వసంబంధ మెంతమాత్రము లేదనియు, వేదవ్యాస మహర్షియే కర్త యనియు, ఆమహాభారతమునే జనమేజయునకు వినిపించినవాడు వైశంపాయనుడు, శౌనకాదులకు వినిపించిన వాడు సౌతి యనియు ధ్రువమైనది.

ఇక ప్రతివాదులు చూపిన మఱియొకప్రమాణము నందుకొందము