పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/44

ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

29

రిక పై నాచే చెప్పబడుచున్నట్టియు లక్షగ్రంథమును అర్థముతో దెలిసికొనుడు. అని సౌతి శౌనకాదులకు చెప్పెనని అవాక్యమున కర్థము.

ఇట్లుండ ప్రతివాదులు'నాచే చెప్పబడిన లక్షగ్రంథమునువినుడు' అని యర్ధము చెప్పి లక్షగ్రంథమునకు సౌతి కర్తయని సాగించినారు.

పూర్వము నిరూపింపబడినట్లు వ్యాసమహర్షికి తప్ప మరెవ్వరికిని కర్తృత్యసంబంధము లేదు.అదియటుండగా,ప్రతివాదులన్నట్లు సౌతి , శౌనకాదులకు చెప్పె ననవలెనో, లేక నీలకంఠీయప్రకారము చెప్పెననవలెనో పూర్వప్రసంగమును చూచిన తేలును.

నైమిశారణ్యమందు కులపతియగు శౌనకమహర్షి యొక్క ద్వాదశవార్షిక సత్రయాగమందు సత్కథాశ్రవణతత్పరు లగు తపస్వుల సమావేశము కలిగియుండ నచ్చటికి వచ్చిన సౌతికి ఉచితాసన మిచ్చి నీరాకయెచ్చటనుండి? యింతవరకు కాలక్షేపము ఎచ్చట? అని ప్రశ్నించిన మహర్షులకు సౌతి యిట్లు చెప్పెను -

 "జనమేజయస్య రాజర్షేః సర్పసత్రే మహాత్మనః |
  సమీపే పార్థివేన్ద్రస్య సమ్యక్పారిక్షితస్య చ ||
  కృష్ణద్వైపాయనప్రోక్తా స్సుపుణ్యా వివిధాః కథాః |
  కథితా శ్చాపి విధివ ద్యా వైశంపాయనేనవై ||
  శ్రుత్వా౽హం తా విచిత్రార్థా మహాభారతసంశ్రితాః |
  బహూని సంపరిక్రమ్య తీర్థా న్యాయతనానిచ ||
  సమంతపంచకం నామ పుణ్యం ద్విజనిషేవితమ్ |
  గతవా నస్మి తం దేశం యుద్ధం యత్రా౽భవ త్పురా ||
  కురూణాం పాండవానాంచ సర్వేషాంచ మహీక్షితామ్ |
  దిదృక్షు రాగత స్తస్మా త్సమీపం భవతా మిహ || ఆది. 1. అ.1

జనమేజయుని సర్పయాగమందు వ్యాసమహర్షి ప్రోక్తములై,