పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/30

ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

15

    
    ఉపాఖ్యానై స్సహ జ్ఞేయం శ్రావ్యం భారత ముత్తమమ్ |
    చతుర్వింశతిసాహస్రం చక్రే భారతసంహితామ్ |
    ఉపాఖ్యానైర్వి నైతావ ద్భారతం ప్రోచ్యతే బుధైః |
    తతో౽ ధ్యర్థశతం భూయ స్సంక్షేపం కృతవా నృషిః||" (ఆది. అ.l)

(5) “మన్వాదిభారతం కేచి దాస్తీకాది తథా౽పరే!
    తథోపరిచరా ద్యన్యే విప్రా స్సమ్య గధీయతే ! ” (ఆదిప. ఆ 1)

ఇత్యాదులు. ఈవచనములు ప్రతివాదుల కెంత యనుకూలములో పరిశీలింతము.


————♦♦అనేకకర్తృత్వనిరాకరణము♦♦————



(1) "వేదా నధ్యాపయామాస మహాభారతపంచమాన్ |
     సుమన్తుం జైమినిం పైలం శుకం చైవ స్వ మాత్మజమ్ ||
     “ప్రభు ర్వరిష్ణో వరదో వైశంపాయన మేవ చ |
     సంహితాస్తైః పృథక్త్వేన భారతస్య ప్రకాశితాః |”

ఇచ్చట వేదములను, మహాభారతమును వేదవ్యాసమహర్షి సుమంత్వాదులకు అధ్యాపనము చేసెను. ఆసుమంత్వాదులచే భారత సంబంధములైన సంహితలు విడిగా ప్రకాశింప జేయబడినవి. అని చెప్పబడుటచే సుమంత్వాదులకు ప్రకాశకత్వమేకాని ప్రణేతృత్వము చెప్పబడలేదు. ఇచ్చట 'వ్యాసునిది జయము, వైశంపాయనునిది భారతము, సౌతిది మహాభారతము' అనివ్రాసిన ప్రతివాదుల నడుగవలసియున్నది. సుమంత్వాదులు వ్యాసమహర్షి యొద్ద జదువుకొన్నది మీవిభాగము ప్రకారము జయము కావలసియుండగా నదికాక మహాభారత మెట్లైనది? ఆట్లు సుమంత్వాదులు వ్యాసమహర్షి యొద్ద నేమహాభారతమును చదువుకొనినట్లున్నదో ఆమహాభారతమే వ్యాసకర్తృక మనకతప్పునా?