పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/28

ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

13

స్కాందము - ప్రభాసఖండము. అ

“అష్టాదశపురాణాని కృత్వా సత్యవతీసుతః |
భారతాఖ్యాన మకరోద్వేదార్థై రుపబృంహితమ్ ||
లక్షే ణైకేన తత్ప్రోక్తం ద్వాపరాన్తే మహాత్మనా | "


శౌనకోక్తచరణవ్యూహపరిశిష్టము. ఖం॥ 5.


"లక్షం ను చతురో వేదా లక్షం భారత మేవచ "


గీతాధ్యాయాంతగ్రంథము.


"శ్రీ మహాభారతే శతసాహస్య్రాం సంహితాయాం వైయాసిక్యాం"


ఆర్యాసప్తశతి. (గోవర్థనాచార్య: 1080–1140 మధ్య)



“వ్యాసగిరాం నిర్యాసం సారం విశ్వస్య భారతం వన్దే
భూషణతయేవ సంజ్ఞాం యదంకితాం భారతీ వహతిః"

ఈవచనము లన్నియు వేద వ్యాసమహర్షి నారాయణ స్వరూపుడనియు,. అత డష్టాదశపురాణములు రచించి వేదార్థ ప్రకాశకము, శ్రేయోదాయకము నగు మహాభారతము రచించెననియు, నా మహాభారతము అంధకారము నణచు సూర్యచంద్రులవలె నజ్ఞానాంధకారము నణచుచుండుటచే లోకోపకారకమనియు, నది లక్షగ్రంథాత్మకమనియు, ద్వాపరాంతమందు రచింపబడె ననియు, భారతమహాభారతనామములుకల గ్రంథ మొక్కటే యనియు నైకకంఠ్యముతో నుద్ఘోషించుచున్నవి.

ఇట్లు మహర్షిని గూర్చియు, మహాభారతమును గూర్చియు నిస్సంశయముగా నార్షగ్రంథములు మనకు బోధించుచుండ వానిని విశ్వసింపక కొంద ఱాధునికు లపమార్గమున బడి స్వబుద్ధి ప్రాభవమాత్రమున విమర్శింపమొదలిడి మహర్షియొక్కయు, మహాభారతము యొక్కయు పేరు లేకుండ జేయవలెనని యెంచియో, అట్లు వ్రాసినగాని తమకు పేరు రాదని యెంచియో తలక్రిందుగా గొన్ని పుస్తకము