పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

అ నే క క ర్తృ త్వ ని రా క ర ణ ము

7

నీకు చెప్పితిని. ఈ యితిహాసము పుణ్యమైనది. పవిత్రము, సర్వోత్తమము అగునీగ్రంథము సత్యవాది, సర్వజ్ఞుడు, విధిజ్ఞుడు, ధర్మజ్ఞుడు, అతీంద్రియవిషయవిశేషజ్ఞుడు, శుచి, తపశ్శుద్దుడు, ఐశ్వర్యోపేతుడు, సాంఖ్యయోగనిరూఢుడు, నానాతంత్రనిష్ణాతుడు నగు వేదవ్యాసమహర్షిచే దివ్యదృష్టితో జూచి మహాత్ములగు పాండవులయొక్కయు, ధనతేజస్సమృద్దు లగు అన్యక్షత్రియులయొక్కయు కీర్తిని, దేవదేవుడగు వాసుదేవుని క్రీడను, దేవాంశజాతులగు నందఱియొక్క జన్మముక్తులను లోకమందు విస్తరింపజేయ దలచి యీయితిహాసము నిర్మింపబడినది అని చెప్పెను.

దీనిచే మనమహాభారతకర్త ప్రామాణికమూర్డన్యు డనియు, మహాప్రభావసంపన్ను డనియు, భ్రమప్రమాద రహితుడనియు, ధర్మసూక్ష్మాభిజ్ఞు డనియు, తత్త్వకథనతత్పరు డనియు స్పష్టమైనది. మఱియు ధృతరాష్ట్రు డాశ్రమవాసియైయుండ వ్యాసమహర్షి సాక్షాత్కరించి యిట్లనెను

“సంశయచ్చేదనార్థాయ ప్రాప్తం మాం విద్ధి పుత్రక |
న కృతం యైః పురా కైశ్చి త్కర్మ లోకే మహర్షిభిః||

ఆశ్చర్యభూతం తపసః ఫలం త ద్దర్శయామి వః |
కి మిచ్ఛసి మహీపాల మత్తః ప్రాప్తు మభీప్సితమ్ ||

ద్రష్టుం స్ప్రష్టు మథ శ్రోతుం తత్కర్తాస్మి తవానఘ |"

వత్సా! నీసంశయనివారణార్థము వచ్చితిని. ఇంతకు పూర్వమేమహర్షులచేతను లోకమం దేపని చేయబడియుండలేదో అట్టి ఆశ్చర్యకరమగు కార్యమును తపశ్శక్తిచే నీకు ప్రదర్శించుచున్నాడను. నీవు దేనియొక్క ప్రాప్తినికాని, దర్శనమును కానీ, స్పర్శనమునుకానీ, శ్రవణమునుకాని కోరెదవో అద్దానిని నీకు కలుగ జేయుదును. ఇట్లు చెప్ప