పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది

4

మహాభారతతత్త్వ కథనము

టీ. “సవైయాఖ్యాః వ్యాఖ్యాన మధికృత్య కృతో గ్రన్థః వైయాఖ్యః తద్యుక్తాః | యథా - “బ్రహ్మవి దాప్నోతి పరమ్” ఇతి సూత్రస్య వ్యాఖ్యా 'సత్యం జ్ఞాన మనన్తం బహ్మ' ఇతి మన్త్రః |అనువ్యాఖ్యానం ! 'తస్మా ద్వా ఏతస్మాత్ ' ఇతి బ్రాహ్మణమ్ | ఏవ మత్రాపి ప్రథమే౽ధ్యాయే సూత్రిత తస్యార్థస్య ద్వితీయతృతీయాభ్యాం వ్యాఖ్యాన ముత్తరగ్రన్థే నా౽నువ్యాఖ్యానం చ |


అసగా వ్యాఖ్యానము నుద్దేశించి చెప్పబడిన గ్రంథము వైయాఖ్య మనబడును. ఆ వైయాఖ్యముతో గూడినవి సవైయాఖ్యములు. (కుంభకోణపుప్రతిలో ‘సహా వ్యాఖ్యా:' అని పాఠ మున్నది ) కనుక వ్యాఖ్యానరూపము లైన యుపాఖ్యానములతో గూడిన యితిహాసములును, వివిధ శ్రుతులును యీ గ్రంథమందు ప్రతిపాదింపబడినవి. ఆనందవల్లిలో 'బ్రహ్మవి దాప్నోతి వరమ్' అనునది యా వల్లికంతకు సూత్రభూతము. దానికి 'సత్యం జానమ్' అను మంత్రము వ్యాఖ్యానము; 'తస్మా ద్వా ఏతస్మాత్ ' అను బ్రాహ్మణము అనువ్యాఖ్యానము. అట్లే యీ మహాభారతమందు ప్రథమాధ్యాయము సూత్రభూతము ; ద్వితీయతృతీయములు వ్యాఖ్యానభూతములు; ఉత్తరగ్రంథమును వ్యాఖ్యానము.

లోకమందు విద్వాంసులకు సంక్షేపించియు, విస్తరించియు గ్రంథధారణము దృష్టమే కనుక వ్యాసమహర్షి మహత్త్వము కలదై జానపదమైన యీ గ్రంథమును సంక్షేపించియు, విస్తరించియు చెప్పెను. అని తాత్పర్యము.

దీనిచే ఆనందవల్లియందు 'బ్రహ్మవి దాప్నోతి పరమ్' అను వాక్య మొకకాలమందును, 'సత్యం జ్ఞానమ్' అనునది మఱియొక కాలమందును , 'తస్మా ద్వా ఏకస్మాత్ ' ఇత్యాదికము వేఱొక కాలమం